అన్న నడిచొస్తే మాస్ ... అన్న కూర్చుంటే మాస్... అన్న మడత పెడితే మాస్... అనే పాటను చూస్తే మా బోబోరే గుర్తొచ్చేత్తన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చింది మొదలు ఎప్పుడు ఎక్కడ చేయాలన్నా ఆయనకు కవరింగ్ ఉండాల్సిందే లేకపోతే ఆయనకు శివరింగ్ వచ్చెయ్యదు ! కవరింగ్ అంటే ఏమి లేదు మా బాబోరు ఏం చెప్పినా... ఏం మాట్లాడినా తాటికాయ అంత అక్షరాలతో పెంట పేజ్లో వచ్ఛోఎల్లంతే. అద్గదీ మా బోబోరు అంటే. ఫోటో లకు , వీడియోలకు పోజులు ఇవ్వడమంటేనా చెవి, ముక్కూ కోసేసుకుంటారు కదా ! ఇక లైవ్ లో ప్రెస్ మీట్లు పెట్టారంటే చూడాలి నా సామిరంగా అసలు నేను ఈ రాష్ట్రంలో పుట్టి ఉండకపోతే మీరంతా ఏమైపోయేవాళ్లు అన్నట్టుగా తెగ సెప్పెతుంటాడు. 


కానీ అడ్డమైన ప్రశ్నలు వేస్తూ అడ్డదిడ్డంగా ఇరికించడానికి ఎవరైనా ఇలేకరి ప్రయత్నించాడా ఇక అంతే మా బాబొరికి కోపం నసాళానికి వచ్చేద్ది ఏయ్ నిన్ను ఎవరు పిలిచారు. నీ బాస్ ఛానెల్ అంటే నాకు పరమ అలెర్జీ అంటూ మొఖం అదోలా పెట్టస్తాడు. మొన్న ఎన్నికల్లో మా బాబొరిని ప్రజలంతా తీర్మానం చేసుకుని రిటైర్మెంట్ ఇచ్చేయడంతో కరకట్ట కొంపలో కునుకు తీస్తూ కూర్చుండిపోయాడు. 


దేని గురించయినా గట్టిగా ప్రెస్ మీట్ పెట్టి నానా రకాలుగా ఖండించేద్దామా అంటే కొత్త సీఎం ఎక్కడా ఏ విమర్శా రాకుండా అన్ని చకచకా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక అప్పుడు కోతికి గొబ్బిరి షిప్ప దొరికినట్టుగా భ్రమరావతి గొడవ మొదలయ్యింది. ఇక చూస్కోండి భజన మీడియా మొత్తాన్ని పిలిచేసి చూడండయ్యా నేను ఆ రాజమౌళి ని బతిమిలాడి గ్రాఫిక్స్ లో కట్టుకున్న నా భ్రమరావతిని ఆ జగన్ అన్యాయంగా డిలేట్ చేసేస్తున్నాడు అంటూ శాపనార్ధాలు, గగ్గోలు పెట్టుకుంటూ ఓ 25  రోజులుగా ఒకటే హడావుడి.
 

 తన భజన పేపర్లలో, టీవీల్లో 24 గంటలు భ్రమరావతి చలి మంటలు... బాబొరి ఆవేదన అంటూ చూపించిందే  చూపించి, చెప్పిందే చెప్పి మా బాబొరికి మంచి కిక్కు ఇచ్చారు. ఇక నిన్న అసెంబ్లీ లో మా బాబొరి ప్రభుత్వంలో చేసిన భూ బాగోతాలు మొత్తం బయటపెట్టి ఒక్కో పేరు చదువుతుంటే బిక్కచచ్చిపోయాడు కదా ! ఇక అప్పటి నుంచి మీడియా కనిపిస్తే చాలు 102 జరం వచ్చేత్తాంది. మీడియా అంటే పాకులాడిపోయే మా బాబోరు ఇప్పుడు మీడియా ను చూసి దొడ్డి దారిలో పరుగులు పెట్టేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: