దేవుని లీలలు అంతే కొన్నిసార్లు విచిత్రంగా ఉంటాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుండి విజయమ్మ వైజాగ్ ఎంపీగా పోటీ చేసి ఎక్కడైతే ఓడిందో అక్కడే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అసెంబ్లీ సమావేశాల్లో జగన్ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయ్యే అవకాశం ఉందని ప్రకటన చేయటం, ఆ దిశగా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా కేబినేట్ లో, అసెంబ్లీలో ఆమోదం పొందడం విశాఖ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా విశాఖ రాజధానిగా ఉండాలని తీర్మానం చేయడం అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. 
 
2014లో జగన్ ఎన్నో ఆశలతో వైజాగ్ నుండి విజయమ్మను ఎంపీగా పోటీ చేయించాడు. వైజాగ్ నుండి ఎంపీగా పోటీ చేసిన విజయమ్మ టీడీపీ నుండి పోటీ చేసిన కంభంపాటి హరిబాబు చేతిలో 90,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ లక్ష కోట్ల అవినీతి చేశాడని ఆరోపణలు చేయడం, చంద్రబాబు పదే పదే నవ్యాంధ్రకు అనుభవం ఉన్న వ్యక్తి సీఎం కావాలని చెప్పడం, టీడీపీ -జనసేన పార్టీల పొత్తు విజయమ్మ ఓటమికి కారణమయ్యాయి. 
 
నాడు విజయమ్మ ఎక్కడైతే ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిందో నేడు జగన్ అదే విశాఖను ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించటం సచివాలయం, రాజ్ భవన్, అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతుల కార్యాలయాలు ఇలా అన్నీ విశాఖ నగరంలోనే ఏర్పాటు కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలు తప్ప మిగతా అధికారిక కార్యక్రమాలన్నీ విశాఖలోనే జరగనున్నాయి. జగన్ వైజాగ్ ను క్యాపిటల్ గా ప్రకటించటంతో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. 
 
2019 ఎన్నికల్లో మాత్రం వైజాగ్ లో మెజారిటీ సీట్లను వైసీపీ పార్టీ కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ వైజాగ్ లో కొంత ప్రభావం చూపినప్పటికీ విశాఖలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా జగన్ కే మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు జ‌గ‌న్ విశాఖను కేపిట‌ల్ చేయ‌డంతో సీన్ కంప్లీట్‌గా రివ‌ర్స్ కావటంతో పాటు టోటల్ టీడీపీయే వైజాగ్ అంతా ఖాళీ అయ్యేలా ఉంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు, గ‌ణ‌బాబు లాంటి ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్లాన్‌లో ఉన్నారు. మిగిలిన నేత‌లు కూడా టీడీపీలో ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. తెలుగుదేశం పార్టీ నాడు విజయమ్మను ఎక్కడైతే ఓడించటానికి ప్రయత్నించిందో నేడు అక్కడే తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతూ ఉండటం దైవ లీల అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: