జమ్ము కశ్మీర్ లో భారత జవాన్లపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం అవంతీపురా రీజియన్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయ్యారు. కశ్మీర్ లోని సత్ ఫోక్రాన్ క్రేవ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు, సీఆర్ఫీఎఫ్ సంయుక్తంగా కూబింగ్ మొదలుపెట్టారు. దీంట్లో భాగంగా ఉగ్రవాదులు  బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందిన వారో ఇంకా తెలియాల్సి ఉంది. అయితే గతేడాది పూల్వామా దాడి తర్వాత ఉగ్రవాదులు మరోసారి జవాన్లపై కాల్పులను జరిపారు.

 

పూల్వామాలో 8మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు ప్రాణాలు విడిన సంగతి తెలిసిందే. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల ఏరివేతలో కఠినమైన చర్యలను చేపట్టింది. దీంట్లో భాగంగానే జమ్ము కశ్మీర్ ను మూడు ముక్కలుగా చేసింది. కేంద్రపాలిత పరిధిలోకి తీసుకొచ్చింది. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో సాధారణ కశ్మీర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా దేశ భద్రతకు కూడా విఘాతం కల్గుతున్నది. దీంతో కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంతో అక్కడి పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు మూడు నెలల సమయం పట్టింది. 

 

కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పూర్తిగా రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల పట్ల దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైనప్పటికీ పరిస్థితిని అదుపులోకి తెచ్చే వరకూ కమ్యూనికేషన్ వ్యవస్థను రద్దు చేశామని స్ఫష్టం చేసింది. కానీ కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించడం తో గత పది రోజుల క్రితం సుప్రీంకోర్టు జోక్యంతో కశ్మీర్ కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించింది. ఈలోగా మరోసారి ఉగ్రవాదులు దాడికి పాల్పడడం విశేషం. ఈ రోజు జరిగిన దాడిపై కేంద్ర హోంశాఖ సీరియస్ గా స్పందించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థను ఎవరనేది ఆరా తీస్తున్నది. ఉగ్రవాదులపై ప్రభుత్వ వైఖరీ కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: