ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ తీసుకున్న వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల నిర్ణయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు జై కొడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ సర్కార్ కి వస్తున్న ఆదరణ తట్టుకోలేక రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య కల్పించే దిశగా చేసిన ప్రయత్నంలో భాగంగా ఇటీవల అమరావతి ప్రాంతంలో గత నెల రోజులకుపైగా ఆందోళనలు నిరసనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఇటువంటి తరుణంలో ఈనెల 20వ తారీఖున ఆంధ్ర ప్రదేశ్ అత్యవసర అసెంబ్లీ సమావేశాలలో వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం అసెంబ్లీలో లభించటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు ప్రాంతాల ప్రజలు ఫుల్ హ్యాపీగా ఉన్న తరుణంలో అదే రోజు రాత్రి అమరావతి ప్రాంతం దొండపాడు గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు కొంతమంది వైఎస్ విగ్రహానికి నిప్పు లు పెట్టడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

 

దీంతో ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రాంతానికి చెందిన వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనకు బాధ్యులైన వారిని ఎవరిని వదలకుండా ఉండాలని పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు కూడా భారీ ఎత్తున గ్రామంలో కి రావడం తో పరిస్థితి అంతా పోలీసు చేతిలోకి వెళ్ళింది. ఈ పరిణామంతో వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు గ్రామంలో ఆందోళనలు నిరసనలు చేపట్టి నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

అయితే ఇదంతా కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్నారని రాజధాని అమరావతి ప్రాంతంలో గొడవలు సృష్టించడానికి ఈ విధమైన పన్నాగం పన్నారని కొంతమంది వైసిపి పార్టీ కార్యకర్తలు అమరావతి రాజధాని ప్రాంతంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకత్వం పై ఆరోపణలు చేస్తున్నారు. మొన్న ఎమ్మెల్యేపై అదే విధంగా తాజాగా వైయస్ విగ్రహాలపై వాళ్ల టార్గెట్ పడిందని ఈ విధంగా వైసిపి పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి రాజధాని ప్రాంతంలో శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి టిడిపి పార్టీ స్కెచ్ వేస్తుందని ఆరోపిస్తున్నారు వైసీపీ పార్టీ నేతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: