ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  అమరావతికి సంబంధించిన బిల్లును కూడా నిన్నటి రోజున అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.  అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఆమోదం పొందింది.  అయితే, మండలిలో ప్రవేశపెట్టేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  ఒకవేళ మండలిలో ప్రవేశపెట్టినా,ఆమోదం పొందుతుందా అనే డౌట్ అందరిలోనూ ఉన్నది.  


కానీ, ఈ బిల్లుపై ఇప్పటికే అనేక ఇబ్బందులు వస్తున్నాయి.  చాలామంది ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు.  ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.  ఆంధ్రులకు ఏర్పాటు చేసిన అమరావతి కాస్త ఇప్పుడు భ్రమరావతిగా  మారిపోయిందని వైకాపా నేతలు అంటున్నారు.  అమరుల రాజధాని, అమరావతి యొక్క అవసరం, దాని ఆవశ్యకత గురించి బాబు చెప్తున్నారుగాని, దాని గురించిన సరైన వివరణ ఇవ్వలేకపోతున్నారు.  


ఇదే ఆ పార్టీకి ఇబ్బందులు కలిగించింది.  పేపర్ పైనా, గ్రాఫిక్స్ లో అమరావతిని ఆహా ఓహో అంటూ చూపించారు.  అమరావతి బొమ్మ సూపర్ హిట్ గ్యారెంటీ అన్నారు.  అన్నింటికంటే అమరావతిని ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో వేలాది కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది.  లక్షలాది మంది అమరావతికి వస్తారు.  పరిశ్రమలు వస్తాయి.  అభివృద్ధి మొత్తం ఉంటుందని అన్నారు.  


కానీ, చివరకు అమరావతిని కాస్త భ్రమరావతిగా మార్చేశారని ప్రజలు వాపోతున్నారు.  వైకాపా కూడా దీనిపై విమర్శలు చేసింది.  అమరావతి సాధ్యం కాదని చెప్పింది.  అమరావతిని ఇప్పుడు ఏర్పాటు చేయాలి అంటే లక్షల కోట్లు అవసరం అవుతాయి.  ఈ స్థాయిలో డబ్బు లేదు కాబట్టి అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానులకు జగన్ ప్రభుత్వం జై కొట్టింది.  నిరసనల మధ్య, ఉద్రిక్తతల మధ్య బిల్లును పార్లమెంట్ లో ఆమోదించారు.  ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న వైఎస్ జగన్ మరో ముందడుగు వేయడంపై ప్రతిపక్షాలకు కంటిమీద కునుకు లేకుండా పోతుందని అంటున్నారు ఆంధ్రప్రజ. 

మరింత సమాచారం తెలుసుకోండి: