జగన్ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చింది.  ఈ పథకంతో మధ్యలో బడి ఆపేసి పని లేకుండా పిల్లలను స్కూల్ కు పంపించవచ్చు.  అమ్మ ఒడి పథకంతో స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఉపయోగపడుతుంది.  బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లికి కూడా సంవత్సరానికి ప్రభుత్వం కొంత మొత్తంలో డబ్బును అందిస్తుంది.  ఈ డబ్బుతోటి తల్లి దండ్రులకు భరోసా ఉంటుంది.  డబ్బుల కోసం చిన్నారులను స్కూల్ మానిపించడం మానేస్తారు.  అందుకే ఈ పథకాన్ని తీసుకొచ్చింది.   ఈ పథకం గురించి ఈరోజు సభలో ప్రస్తావించారు.  అమ్మఒడి పధకాన్ని ప్రతి ఒక్కరు అభినందించి తీరాలని అన్నారు.  పిల్లలు డబ్బులు లేకనే డ్రాప్ ఔట్ అవుతున్నారు.  

 

ఇకపై అలంటి డ్రాప్ అవుట్ ఉండకూడదు అని చెప్పి ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది.  ఈ పథకం తీసుకురావడం అభినందనీయమని వైకాపా ఎమ్మెల్యే ధర్మశ్రీ పేర్కొన్నారు.  ఈ పధకం ద్వారా పిల్లలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.  అమ్మఒడి పధకం ప్రతి ఒక్కరికి చేరిక కావాలని, ఆయన ఆకాంక్షించారు.  పధకాలు అందరూ తీసుకొస్తారు.  అందరికి ఉపయోగపడే పధకాలు కొందరే తీసుకొస్తారని అన్నారు.  అమ్మఒడి లాంటి పధకం ఇప్పటి వరకు ఎవరూ కూడా తీసుకురాలేదని, ఈ పథకం ప్రవేశపెట్టిన ఘనత ఒక్క జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.  అమ్మఒడి పథకంతో ప్రతి ఒక్కరికి ఎంతగానో మేలు జరుగుతుందని చెప్పడం విశేషం.  


తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన పథకాలు అన్ని కూడా ఓటుహక్కు ఉన్న వాళ్లకు మాత్రమే పరిమితం అయ్యేలా ఉన్నాయని, కానీ, ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే ప్రవేశపెట్టినట్టు ధర్మశ్రీ పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే ఇలాంటి పథకం మరొకటి రాయలేదని అన్నారు.  ఈ పధకం అమలు జరిగితే ఏ విద్యార్థి కూడా స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ కారని ఆయన పేర్కొన్నారు.  ఈ పథకంపై కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేస్తోందని అయన పేర్కొన్నారు.  మూడు రాజధానుల అంశం గురించి ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశాల్లో అనేక బిల్లులను కూడా ప్రవేశపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: