ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి అంతట జరగాలని మూడు ప్రాంతాలు విడిపోకుండా ఉండాలంటే వికేంద్రీకరణ జరగాలి అంటూ సోమవారం అసెంబ్లీలో మూడు రాజధానులు గురించి తీసుకున్న జగన్ నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ మేధావులు అదేవిధంగా ప్రజలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు పాస్ కావడం తో ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా మమ్మల్ని అభివృద్ధిలో భాగస్వామ్యం చేసినందుకు వైయస్ జగన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని స్వీట్లు పంచుకుంటూ ఎక్కడికక్కడ పండగ చేసుకున్నారు.

 

ఇటువంటి తరుణంలో చంద్రబాబు వికేంద్రీకరణ బిల్లు శాసనమండలిలో ఆమోద ముద్ర పొందకుండా ఉండాలని రూల్ 71 తెరపైకి తీసుకు రావడంతో జగన్ సర్కార్ కి బిగ్ షాక్ తగిలినట్లయింది. శాసనమండలిలో కూడా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం తెలిపే విధంగా వ్యవహరించిన గాని శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ  రూల్ 71 ప్రవేశపెట్టడానికి బలమైన సంఖ్యా తెలుగుదేశం పార్టీకి ఉండటంతో వికేంద్రీకరణ బిల్లు శాసన మండలిలో పాస్ కాకుండా వ్యవహరిస్తోంది. కనీసం తీర్మానానికి కనీసం 20 మంది మద్దతు ఉండాలి కాగా 20 మంది కంటే 30 మంది ఎమ్మెల్సీల మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉండటంతో వికేంద్రీకరణ బిల్లుపై చర్చకు మండలి విపక్షనేత యనమల రామకృష్ణుడు పట్టుబట్టారు.

 

తీర్మానంపై చర్చను ఆమోదిస్తే ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించినట్టే అవుతుంది. దీంతో రూల్ 71ని ప్రవేశపెట్టే అధికారం మండలికి లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొంటున్నారు. మొత్తానికి టీడీపీ వ్యూహంతో ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. దీంతో ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగైనా బిల్లు పాస్ చేయించాలని శాసన మండలి రద్దు చేసే ఆలోచనలో వైయస్ జగన్ సర్కార్ ఉన్నట్లు వార్తలు వినపడుతున్నాయి. మొత్తంమీద చూసుకుంటే వికేంద్రీకరణ బిల్ ఎలాగైనా పాస్ చేయడం కోసం వైయస్ జగన్ సర్కార్ నానా తంటాలు పడుతోంది. అసెంబ్లీలో ఫుల్ బలం ఉన్నాగానీ శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ నేతలు బలంగా ఉండటంతో వికేంద్రీకరణ బిల్ అటూ ఇటూ కాకుండా అయిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: