ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో  మొత్తం అట్టుడికి పోతున్న అంశం జగన్ ప్రకటించిన మూడు రాజధానులు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల  ప్రకటన చేసినప్పటి నుంచి ఆంధ్ర రాజకీయాలు  ఒక్కసారిగా వేడెక్కాయి. విపక్ష పార్టీలన్నీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతి రైతుల మొత్తం జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు ఆందోళనలు చేస్తున్నారు. రాజధాని కోసం పంట పండించుకొని భూములను  త్యాగం చేశామని... కానీ ఇప్పుడు రాజధాని అమరావతి నుంచి తరలిస్తామని ప్రభుత్వం అంటోంది. దీంతో తమకు అన్యాయం జరుగుతుంది అంటూ ఆరోపిస్తున్నారు. అయితే జగన్  మోహన్ రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయంపై మొన్నటి వరకు టిడిపి జనసేన బిజెపి విమర్శలు చేస్తుండగా... తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం పై విమర్శల ప్రారంభించింది.

 

 

 ఎవరెన్ని విమర్శలు చేసినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి  సర్కార్...3 రాజధాని లకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించిన బిల్లు శాసనమండలిలో పెట్టారు. ఇదిలా ఉంటే అమరావతి రాజధాని మార్పు కు సంబంధించి బిజెపి నేత నాదెండ్ల భాస్కరరావు చంద్రబాబుపై విమర్శలు చేశారు. మురికి గుంటలో రాజధాని పెట్టడం చాలా తప్పు అని... చంద్రబాబును నేను ఎంతో వ్యతిరేకించారు.. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని  చంద్రబాబు మురికి గుంటలో కట్టారు అంటూ నాదెండ్ల భాస్కర రావు విమర్శించారు. నాగార్జున యూనివర్సిటీ దగ్గర్లోనో లేకపోతే  గుంటూరు లో  రాజధాని ఏర్పాటు చేస్తే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేసారు. 

 

 

 శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ మొనగాడు అయితే... కౌన్సిల్లో చంద్రబాబు మనగాడు... వీళ్లిద్దరు కొట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైపోవాలి అంటూ ప్రశ్నించారు.చివరికి వీరిద్దరూ  కులాలను ఎత్తిచూపుకొని మరి తిట్టుకుంటున్నారని... ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ప్రతిబంధకంగా ఉంది కేవలం రాజకీయాలు మాత్రమే అంటూ విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే  కాదు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు కూడా ముమ్మాటికీ తప్పే అంటూ... ఇద్దరు  నేతల పై తీవ్ర విమర్శలు చేశారు నాదెండ్ల భాస్కర్ రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: