తెలంగాణ పీసీసీకి కొత్త చీఫ్ రాబోతున్నారు. ఒకటి.. రెండు రోజుల్లోనే ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన రానుంది. కర్ణాటకతో పాటు..తెలంగాణకు ఒకేసారి కొత్త చీఫ్‌లను నియమించే అవకాశాలున్నాయి. 

 

తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఉత్కంఠకు తెరపడనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఒకటి రెండు రోజుల్లోనే టీపీసీసీకి  కొత్త చీఫ్ ఎవరనేది తేలిపోతుంది. ఇప్పటివరకు...అధిష్టానం పరిశీలనలో ముగ్గురి పేర్లు ఉన్నాయి. మాజీ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిల  పేర్లు అధిష్టానం పరిశీలిస్తోంది. పార్టీ విధేయుడికే పట్టం కట్టాలని అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ జనంలో ఉన్న క్రేజ్‌ని పరిగణనలోకి తీసుకుంటే  పీసీసీ నియామకం మరోవిధంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒకటి రెండు రోజుల్లోనే దీనిపై హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని పార్టీ వర్గాలు  భావిస్తున్నాయి. 

 

ఇక...తెలంగాణకు పీసీసీతో పాటు...వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంపై కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్...ఢిల్లీ వెళ్లారు.  పార్టీ ముఖ్యులను కలిశారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోరే ప్రయత్నాలు చేస్తున్నారు అంజన్. అయితే...అంజన్‌కి హైకమాండ్ నుంచి సానుకూల స్పందన మాత్రం  కనిపించటంలేదట. ప్రస్తుతం తెలంగాణకి పార్టీ అధిష్ఠానం పీసీసీతోనే సరిపెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. 

 

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం..ఒకటి రెండు రోజుల్లో టీపీసీసీ ఎవరన్నది తెలిపోనుంది. అయితే అధిష్టానం ఎవరిని ప్రకటిస్తుంది?అనేదే ప్రస్తుతం  చర్చనీయాంశంగా మారింది. అసలు ఒకటి..రెండు రోజుల్లోనే తెలిపోతుందా..?ఢిల్లీ ఎన్నికలు అయ్యేంతవరకు టీపీసీసీ ఎంపిక ప్రక్రియ ఆగుతుందో చూడాల్సిందే మరి.

 

తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ అనగానే అధిష్టానానికి కత్తిమీద సాములా మారింది. ఎవర్ని నియమిస్తే.. ఎవరు పార్టీకి దూరమవుతారో అనే సందేహం కూడా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం బాధ్యతల అప్పగింతలో ఆచితూచి వ్యవహరిస్తోంది. తెలంగాణకు పీసీసీ చీఫ్ ను ఏ ప్రాతిపాదికన నియమిస్తుందో చూాడాలి. సీనియర్ అని చూస్తుందా.. లేక జనాల్లో క్రేజ్ ఉన్న నాయకుడిని చూస్తుందా.. లేక పార్టీకి విధేయత కలిగి ఉన్న నాయకుడిని  నియమిస్తుందో చూడాలి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: