రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వి.నాగిరెడ్డి మున్సిపల్ ఎన్నికలు అభ్యర్థులకు గట్టి వార్నింగ్ ఏ ఇచ్చారు.. అంత గట్టి వార్నింగ్ ఏంటి అనుకుంటున్నారా? రేపు జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల గురించి నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు.. కమిషనర్‌ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో టెండర్ ఓటు వేస్తే రీ పోలింగ్ తప్పనిసరి నిర్వహిస్తామని చెప్పారు..   

 

అలానే.. దొంగ ఓట్లు వేస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కాగా ఇప్పటికే మున్సిపల్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అయన తెలిపారు. కాగా ఈ మంచిపల్ ఎన్నికలు ఉదయం 7 గంటల నుండి సాయింత్రం 5 గంటల వరుకు జరగనుంది.. 120 మున్సిపాలిటీలు, 9 కార్పోరేషన్లలో ఈ ఎన్నికలు జరగనున్నట్టు యన తెలిపారు.     

 

అయితే ప్రతి ఒక్కరు తప్పక ఓటు హక్కును వినియోగించుకోవాలని అయన సూచించారు.. అయితే టెండర్ ఓటు ఒక్కటి పడినా ఆ ప్రాంతంలో మల్లి పోలింగ్ నిర్వహిస్తామని.. టెండర్ ఓటు వేసిన చోట ఓట్ల లెక్కింపు జరగనివ్వము అని అయన సీరియస్ గా చెప్పారు. కన్నా ఎన్నికల్లో సంచులను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకున్నట్టు అయన చెప్పారు.. అయితే అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వివరాల్లో తప్పుడు లెక్కలు.. తప్పుడు సమాచారం చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు అయన చెప్పుకొచ్చారు. 

 

కాగా పోలింగ్ కేంద్రాల్లో అభ్యర్థి వివరాలను నోటీసు బోర్డు లో ఖచ్చితంగా ఉంచుతామని.. అభ్యర్థులు చరిత్ర అంత.. అన్ని వివరాలు అందులో ఉంటాయి అని.. అభ్యర్థి నిజస్వరూపం తెలుసుకొని.. ఓటర్లు ఎవరికి ఓటు వెయ్యాలో తెలుసుకొని వేసేలా సమాచారాన్ని ఉంచుతామని అయన చెప్పుకొచ్చారు. అంటే దీన్ని బట్టి చూస్తే మాటలు చాలా సీరియస్ గా ఉన్నాయని అర్థం అవుతుంది. మరి రేపు ఎన్నికలు ఎలా జరుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: