రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని దీని కోసం పాలన వికేంద్రీకరణ చేపడితేనే ... అభివృద్ధి వికేంద్రీకరణ సాధ్యమని  అందుకే రాష్ట్రంలో  మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేశారు. ఇక ఆ తర్వాత ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ... మూడు రాజధానుల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం ముద్ర వేసింది  జగన్ సర్కార్. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో భారీ మెజారిటీ ఉండటంతో సులభంగానే 3 రాజధానిల కి సంబంధించిన బిల్లు ఆమోదం పొందింది. కాగా నేడు ఈ బిల్లును శాసన మండలి లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం. శాసనమండలిలో జగన్మోహన్ రెడ్డి  మూడు రాష్ట్రాల బిల్లుకు చుక్కెదురైంది. 

 

 

 

పెద్దల సభలో వైసీపీకి తక్కువ మెజారిటీ ఉండడంతో  టిడిపికి ఎక్కువ మెజారిటీ ఉండడంతో... శాసనమండలిలో మూడు రాజధానిల బిల్లును అడ్డుకుంటామని అసెంబ్లీ వేదికగా చంద్రబాబునాయుడు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఇక ఇక ఈ రోజు శాసనమండలిలో ప్రవేశపెట్టిన 3 రాజధానిల బిల్లుకు టిడిపి ఎమ్మెల్యేలు అందరూ తీవ్రస్థాయిలో వ్యతిరేకత తెలుపుతున్నారు. పెద్దల సభగా పిలుచుకునే శాసనమండలి మొత్తం టిడిపి వైసిపి ఎమ్మెల్సీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో రసాభాసగా మారిపోయింది. ఈ సందర్భంగా వైసీపీ మంత్రులు అందరూ శాసనమండలిలో ఆందోళన చేపడుతున్నారు. 

 

 

 

 శాసనమండలిలో జరుగుతున్న రసాభాస,  టీడీపీ ఎమ్మెల్సీల తీరుపై విశాఖలోని వైసీపీ కార్యాలయం నుంచి వైసీపీ నేత  దాడి వీరభద్రరావు మీడియా సమావేశం ద్వారా టిడిపి పై తీవ్ర విమర్శలు చేశారు. పెద్దల సభలో టీడీపీ ప్రతిష్టంభన  వెనుక టీడీపీ ఉద్దేశంతో చెప్పాలంటూ నిలదీశారు ఆయన. శాసనమండలిలో టీడీపీకి మెజారిటీ ఉంటే బిల్లులో సవరణలు కోరవచ్చని కానీ పూర్తిగా బిల్లును వ్యతిరేకించ వద్దు అంటూ వ్యాఖ్యానించారు వైసిపి నేత దాడి వీరభద్ర రావు. కౌన్సిల్ రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారూ  అన్న  లోకేష్ వ్యాఖ్యలను  ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. లోకేష్ ఇంకా రాజకీయాలు తెలుసుకోవాలని... కౌన్సిల్ రద్దు చేసే అధికారం ఎవరిచ్చారో  మీ నాన్నని మీ తాత ను అడగాలి అని  తెలిపారు. కౌన్సిల్ రద్దు చేసే అధికారం రాజ్యాంగంలో ఉంది అంటూ తెలిపారు . రాజకీయాలను తెలుసుకోకుండా రాజకీయ విమర్శలు చేస్తే మీ పరువు పోతుంది అంటే ఆయన విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: