ఫిబ్రవరి నెల 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. పార్టీకి ఎమ్మెల్యే వీరేందర్ సింగ్ గుడ్ బై చెప్పారు. ఆప్ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ను కేటాయించకపోవడంతో పార్టీని వీరేందర్ సింగ్ వీడారు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీకి వీరేందర్ సింగ్ తన రాజీనామా లేఖను సమర్పించారు.                  
 
ఆ తరువాత తన ట్విట్టర్ ఖాతా ద్వారా వీరేందర్ సింగ్ స్పందించారు. తనకు ఈరోజు ఎంతో బాధాకరమైన రోజు అని వీరేందర్ సింగ్ అన్నారు. తన రాజీనామా లేఖను ఆప్ కు సమర్పిస్తున్నానని ట్వీట్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఢిల్లీలో ఉన్న 70 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ అసెంబ్లీ ఎన్నికలలో 23 మంది కొత్తవారికి పోటీ చేసే అవకాశం ఆప్ కల్పించింది. 
 
అందువలన గత ఎన్నికలలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి కూడా టికెట్లను కేటాయించలేదు. దేశ రాజధానిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఈరోజే అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ వేయడాని చివరి రోజు. స్వతంత్ర్య అభ్యర్థులు భారీ స్థాయిలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఒకే దశలో ఢిల్లీకి పోలింగ్ జరగనుంది. 
 
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8వ తేదీన జరగనుండగా ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆప్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇతర రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఆప్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు.కానీ బీజేపీ, కాంగెస్ పార్టీలు కూడా ఎన్నికల్లో మెజారిటీ స్థానాలలో విజయం సాధించటానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: