మూడు రాజధానుల వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి నష్టం జరగనుందా? అంటే ప్రస్తుత పరిస్థితులని చూస్తే కాదనే సమాధానం వస్తుంది. ఉమ్మడి ఏపీ విడిపోయాక పదేళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా.... 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అక్కడ నుంచి వచ్చేశారు. ఎందుకు వచ్చేశారు? అక్కడ ఏం జరిగిందనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఆ విషయం పక్కనబెట్టేస్తే...ఎలాగోలా వచ్చారు...అమరావతిని రాజధానిగా చేశారు. ఐదేళ్లు గ్రాఫిక్స్ చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా భారీగా అక్రమాలు చేశారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ చేస్తూ....రాష్ట్రాన్ని గాలికొదిలేసి, అప్పులు చేసి, ప్రజలని అధోగతి పాలు చేసి 2019లో గద్దె దిగారు.

 

బాబుని గద్దె దించి అదిరిపోయే మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్...ఏడు నెలల్లో రాష్ట్ర ప్రజలపై సంక్షేమ జల్లులు కురిపించారు. ఇక సంక్షేమంతో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగితేనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందనే విధానంలో మూడు రాజధానులు తెరపైకి తెచ్చి, దానిపై ముందుకెళుతున్నారు. ఇందులో భాగంగా అమరావతిని పూర్తి క్యాపిటల్ కాకుండా దాన్ని లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలుని జ్యూడిషయల్ క్యాపిటల్ చేయనున్నారు. అయితే ఈ మూడు రాజధానులని అన్ని ప్రాంతాలు వారు స్వాగతిస్తున్నారు.

 

కానీ అమరావతి ప్రాంతం, ఆ అమరావతికి అటు ఇటు ఉన్న కృష్ణా, గుంటూరు ప్రజలు స్వాగతించడం లేదని, వారు జగన్‌పై వ్యతిరేకితతో ఉన్నారని ఓ ప్రచారం ఉంది. అయితే వాస్తవానికి అలాంటి వ్యతిరేకిత ఎక్కడ లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఏ విధమైన ఆందోళన లేదు. ఏదో టీడీపీ నేతల హడావిడి తప్ప పెద్ద ఏమి లేదు. నిజంగా ప్రజల్లోనే ఆందోళన ఉంటే...రాజధాని ప్రజల మాదిరిగా రోడ్లపైకి రావాలి. కానీ గడిచిన నెల రోజుల్లో గానీ, తాజాగా మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందినప్పుడు కూడా అలాంటి అలజడి ఏం లేదు. ఇక్కడి ప్రజలు కూడా జగన్ నిర్ణయానికి పూర్తి మద్ధతు తెలుపుతున్నారు. ఎందుకంటే అమరావతి కూడా ఒక రాజధానిగా ఉండటం, ఇక్కడి అభివృద్ధికు కూడా ప్రభుత్వం ప్రణాళిక చెప్పడంతో ప్రజల్లో ఆందోళన లేదు.

 

అయితే రాజధానికి సంబంధించిన 29 గ్రామాల్లో కాస్త ఆందోళన ఉంది. అందులోనూ ఐదారు గ్రామాల్లో ఎక్కువగా ఉంది. ఇక దీని బట్టి చూసుకుంటే వైసీపీకి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎలాంటి నష్టం జరగదు. మహా అయితే అమరావతిలో నాలుగైదు పంచాయితీలు కోల్పోవడం తప్ప.

 

మరింత సమాచారం తెలుసుకోండి: