అధికారంలో ఉన్నవారు ఎవరైనా...ఏదైనా పథకం పెట్టిన, అభివృద్ధి పని చేసిన దాని వల్ల ఎన్ని ఓట్లు వస్తాయనే లెక్కలు వేసుకుంటారు తప్ప. దాని వల్ల ప్రజలకు నిజంగా ఎంతవరకు లబ్ది చేకూరుతుందనేది చూడరు. ముఖ్యంగా చంద్రబాబు లాంటి నాయకుడు అయితే గత ఐదేళ్లు అదే పని చేశారు. ఓట్ల కోసం పథకాలు సృష్టించారు. ఆఖరికి ఎన్నికల సమయంలో కూడా పసుపు-కుంకుమ, పెన్షన్ పెంపు అంటూ ఓట్ల కోసం డ్రామాలు ఆడారు. అయితే ఆ ఐదేళ్ల చంద్రబాబు పాలనకు విరుద్ధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ వెళుతున్నారు.

 

కేవలం అధికారంలోకి వచ్చిన 8 నెలలల్లోనే ప్రజలకు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా వెళుతున్నారు. బాబు లాగా ఓట్లు, సొంత లబ్ది అని చూడకుండా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. చంద్రబాబు మాదిరి పార్టీలు, కులాలు, ప్రాంతాలు అని చూడకుండా అర్హులైన అందరికీ  అనేక పథకాలు అమలు చేశారు. అయితే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏమిటంటే? రాబోయే రోజుల్లో రాష్ట్ర భవిష్యత్ ఉండేది పిల్లలు, యువత చేతిలోనే ఉందని  గ్రహించిన జగన్...వారి కోసం మునుపెన్నడూ ఏ సీఎం అందివ్వని సరికొత్త పథకాలని తీసుకొచ్చారు.

 

ముఖ్యంగా ప్రతి పేద పిల్లలకు మంచి భవిష్యత్ ఉండాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. అలాగే ప్రతి పిల్లవాడు ఆరోగ్యం ఉండాలని జగనన్న గోరుముద్ద పేరిట అదిరిపోయే మధ్యాహ్న భోజనం అందివ్వనున్నారు. అలాగే స్కూల్స్ అభివృద్ధికి నాడు-నేడు కార్యక్రమం, పిల్లలకు జగనన్న విద్యా కానుక పేరిట ఓ కిట్. అందులో పిల్లల అవసరాలకు కావల్సిన అన్ని వస్తువులు ఉంటాయి.

 

అదేవిధంగా వసతి దీవెనా పేరిట ఇంటర్, ఇంజినీరింగ్ విద్యార్ధులకు ఏటా రూ. 20 వేలు. విద్యా దీవెనా పేరిట మొత్తం ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ ఇవ్వనున్నారు. ఇక ఇప్పటికే అమ్మఒడి పథకాన్ని అమలు చేసి ప్రతి పేద తల్లి కళ్ళలో ఆనందం నింపారు. ఇవన్నీ చూస్తే తాను చేసేది ఓట్ల కోసం కాదని ప్రజల భవిష్యత్తు కోసమని జగన్ నిరూపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: