సాధారణంగా చిన్న పిల్లలు ఏదొక విషయం మీద గొడవ పడుతుంటారు. ఇక ఆ గొడవ సమయంలో బలమైన పిల్లవాడు ఉంటే, బలహీనమైన పిల్లాడిని కొడతాడు. అయితే బలం లేని పిల్లవాడు వాడిని కొట్టలేక, మా అమ్మకు చెప్తా...మా అమ్మకు చెప్పి నిన్ను తన్నిస్తా అంటూ శపథం చేస్తాడు. అయితే ఇక్కడ వాడు వాళ్ళ అమ్మకు చెప్పేది ఉండదు. చెప్పిన అమ్మ వచ్చి కొట్టేది ఉండదు. ఏదో పైకి గంభీరంగా శపథం చేయడం తప్ప పొడిచేది ఏముండదు. సరిగా ఇందులో బలం లేని పిల్లాడు ఎలాంటి డైలాగులు వేస్తున్నాడో...జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు అదే డైలాగులు వేస్తున్నారు.

 

ఎన్నికల సమయంలో ఏదో పోడిచేద్దామని అనుకుని జగన్ చేతిలో చావు దెబ్బ తిని, ఒక్క సీటు తెచ్చుకున్నారు. ఇక మనకు బలం లేదని పవన్ ఏమైనా తగ్గడా? అంటే అబ్బే అసలు తగ్గలేదు. గాలి బుడగల్లాగా తెగ రెచ్చిపోతూ జగన్ పై విమర్శలు చేస్తున్నారు. సరే ఏదో ఓడిన బాధలో చేస్తున్నారని వదిలేస్తుంటే, ఇంకా హడావిడి చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్‌ ఏమన్నా చుక్కలు చూపిస్తారేమో అని భయంతో తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పంచన చేరారు.

 

ఇక బీజేపీతో కలిసిన దగ్గర నుంచి మరి పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. తనకు అంత సీన్ లేదని తెలిసి కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా మూడు రాజధానుల విషయంపై కూడా పవన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఏదో ఒకరోజు అమరావతి ప్రాంతానికి వెళ్ళి రైతులని పరామర్శిస్తున్నట్లు డ్రామాలు ఆడి, అక్కడ ప్రగల్భాలు పలుకుతున్నారు. అది కూడా బీజేపీ అండ ఉందనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు.

 

అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పి, నేను ఢిల్లీకి వెళ్ళి చెప్తా అంటూ చిన్న పిల్లల డైలాగులు వేస్తున్నారు. అసలు మాకు సంబంధం లేదురా బాబో అంటూ ఢిల్లీ పెద్దలు ఓ వైపు చెబుతుంటే పవన్ మాత్రం...నేను చెప్తా, జగన్ ప్రభుత్వం అంతు చూస్తా, వైసీపీని కూలుస్తా అంటూ పనికిమాలిన సినిమా డైలాగులు వేస్తున్నారు. మొత్తానికైతే పవన్ చిన్న పిల్లాడిలా మాట్లాడటం తప్ప పెద్దగా పొడిచేది ఉండదని జననానికి ఈ పాటికే అర్ధమైపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: