ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శీతాకాల అసెంబ్లీ సమావేశంలో భాగంగా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ కోసం  3 రాజధానిల ప్రకటన చేసిన తర్వాత... ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించిన అమరావతిలో ఎన్ని నిరసనలు జరిగిన  ఎట్టకేలకు అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించినది  జగన్ సర్కార్. అయితే అసెంబ్లీలో జగన్ సర్కార్ కు 151 మంది ఎమ్మెల్యేలు మెజారిటీ ఉంది కాబట్టి అసెంబ్లీలో సులభంగానే మూడు రాజధానుల  బిల్లు ఆమోదం పొందింది. కానీ రాష్ట్ర పెద్దల సభ గా పిలుచుకునే శాసనమండలిలో మాత్రం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తలపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు అడ్డంకులు ఎదురయ్యాయి. 

 

 

 శాసనమండలిలో టిడిపి పార్టీకి ఎక్కువ మెజారిటీ ఉండడంతో వైసీపీకి శాసనమండలిలో చిక్కులు వచ్చిపడ్డాయి. మూడు రాజధానిల బిల్లుకు శాసనమండలి చైర్మన్ సహా... టిడిపి ఎమ్మెల్సీలందరూ వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో శాసన మండలి మొత్తం రసాభాసగా మారింది. శాసనమండలిలో హాజరైన వైసీపీ మంత్రులు... ఎట్టి పరిస్థితుల్లో బిల్లును శాసన మండలిలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కాగా టీడీపీ ఎమ్మెల్సీల అందరూ జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు... ఇక వైసీపీ మంత్రులు కూడా ఛైర్మన్ పొడియం దగ్గరకు వచ్చి నినాదాలు చేశారు. దీంతో శాసనమండలి మొత్తం రసాభాసగా మారి పోయింది. 

 

 

రూల్ 71 కింద కౌన్సిల్ లో చర్చ జరపాలని టిడిపి ఎమ్మెల్సీలు డిమాండ్ చేయగా... శాసనమండలిలో ప్రతిష్టంభన సరైనది కాదని... శాసనమండలిలో ముందుగా... మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు వైసిపి మంత్రుల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతివిమర్శలు జరిగాయి. ఈ క్రమంలోనే వైసీపీ మంత్రులు అందరూ చైర్మన్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు  చేశారు. అయితే శాసనమండలి చరిత్రలోనే మంత్రులు వచ్చి శాసనమండలి చైర్మన్ పోడియం వద్ద నినాదాలు చేయడం చరిత్రలో తొలిసారి. ఎందుకంటే ఎప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి శాసనమండలిలో పూర్తి మద్దతు ఉంటుంది కానీ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగని నేపథ్యంలో ఇంకా టీడీపీ అభ్యర్థుల శాసనమండలిలో ఎక్కువ ఉన్నారు. దీంతో బిల్లు ఆమోదం పొందేందుకు మంత్రులు సైతం శాసనమండలిలో రంగంలోకి దిగి ఏకంగా చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: