మన తెలంగాణ ఎన్నో వాటిలో ఫస్ట్ వచ్చింది.. ఒకటి రెండు కాదు.. చాలావాటిలో తెలంగాణ ఫస్ట్ వచ్చింది. అయితే ఇప్పుడు తెలంగాణ మరో అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. అదేంటి అనుకుంటున్నారా ? అదేనండి. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణలో తొలిసారి ఫేస్ రికగ్నిషన్‌ టెక్నాలజీని వాడుతున్నారు. ఈ టెక్నాలజీని దేశంలోనే మొదటిసారి వాడుతున్నారు.        

 

దేశంలోనే తొలిసారిగా ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ.. తెలంగాణ మునిసిపోల్స్‌లో వాడుతున్నారు. దీని ప్ర‌కారం దేశంలోనే తొలిసారిగా మున్సిపల్‌ ఎన్నికల్లో పైలట్‌ ప్రాజెక్టు కింద ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని ఎస్‌ఈసీ వినియోగిస్తోంది. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10 వార్డుల్లో స్మార్ట్‌ఫోన్లలో ఫొటో తీసి ఓటర్లను ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ ద్వారా ఆ వార్డుల్లోని ఓటర్ల జాబితాతో సరిపోలితేనే ఓటింగ్‌కు అనుమతిస్తారు.         

 

అయితే ఈ ఫేస్ రికగ్నిషన్ యాప్ ఎంతో ఉపయోగ పడనుంది.. ఒకవేళ ఈ పైలెట్ ప్రాజెక్ట్ సూపర్ హిట్ అయితే సంచలనమే.. ఎందుకు అంటే ఇక దొంగ ఓట్లు ఎక్కడ పడవు.. అంతేకాదు తెలంగాణకు అరుదైన గౌరవం లభిస్తుంది. అయితే ఈ ఫేస్ రికగ్నిషన్ తో ఇంకా ఎన్నో  సాధించచ్చు.. ఈ ఫేస్ రికగ్నిషన్ తో నేరాలను కనిపెట్టచ్చు..                            

 

నేరాల నియంత్రణకు ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నా విషయం మన అందరికి తెలిసిందే. అయితే ఈ ఫేస్ రికగ్నిషన్ ఎంతో ఉపయోగ పడుతుంది. అందుకే ఈ ఫేస్ రికగ్నిషన్ హిట్ అవుతే ఇంకా రాజకీయనాయకులు ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో మరి.. ఏది ఏమైనా మన తెలంగాణలోనే మొదటిసారి ఇది రావడం మనకు గౌరవమే..         

మరింత సమాచారం తెలుసుకోండి: