జగన్మోహన్ రెడ్డి దెబ్బకు జనసేన అధినేత పవన్ కల్యాన్ రాజకీయాలు వదిలేసినట్లేనా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. అనుమానాలు ఎందుకు వస్తోందంటే మంగళవారం హైదరాబాద్ లో  మొదలైన సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి పవన్ హాజరయ్యారు. హిందీ సినిమా పింక్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్న్యాయవాది పాత్రను పోషిస్తున్నారట.

 

’జగన్ పరిపాలన బాగా చేస్తే తాను రాజకీయాలను వదిలేసి సినిమాల్లోకి వెళిపోతా’ అని అప్పట్లో పవన్ చాలా గంభీరంగా ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసిందే.  మరిపుడు పవన్ సినిమాల్లో బిజీ అవుతున్నాంటే ఏమనర్ధం ?  మెల్లిగా రాజకీయాలను వదిలేసి పూర్తి కాలాన్ని సినిమాలకు మాత్రమే కేటాయించాలని పవన్ డిసైడ్ అయినట్లు సమాచారం.

 

నిజానికి జనసేనను పెట్టి ఏడేళ్ళయినా ఇంత వరకూ పీకిందేమీ లేదు.  ఏడేళ్ళల్లో  కనీసం రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోయారంటే పార్టీ నిర్వహణ ఎంత బాగా ఉందో అర్ధమైపోతోంది.  తెలంగాణాలో రెండు ఎన్నికల నుండి విత్ డ్రా అయిపోయారు. ఏపిలో కూడా ఒక ఎన్నిక నుండి తప్పుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో పాల్గొని తల బొప్పి కట్టించుకున్నారు. స్వయంగా తాను పోటి చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో  ఓడిపోయిన విషయం తెలిసిందే.

 

మొన్నటి ఎన్నికల ప్రచారంలో జగన్ ను సిఎం కానీవ్వనంటూ బీషణ ప్రతిజ్ఞ చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. పాపం రాజకీయాల్లో తన పూర్తి కాలాన్ని చంద్రబాబునాయుడు ప్రయోజనాలను రక్షించటానికే కష్టపడ్డారు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాతే జగన్ దెబ్బంటే ఏమిటో  పవన్ కు తెలిసొచ్చింది. దాంతో  అప్పటి నుండి ఎప్పుడెప్పుడు కాడిని దింపేద్దామా ? అని ఎదురు చూస్తున్నారు. చివరకు బిజెపితో పొత్తు పెట్టుకోవటం ద్వారా పార్టీ భారాన్ని దాదాపు దింపేసుకున్నట్లే. నీట్ గా  షేవ్ చేసుకుని, కటింగ్ చేసుకుని సినిమా షూటింగ్ కు హాజరయ్యారంటేనే పవన్ ఎంత రిలీఫ్ ఫీలవుతున్నారో తెలిసిపోతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: