ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా, ఇటావాకి దగ్గిరలో ఉన్న మెయిన్ పూరి సమీపంలో "బెవర్ " ప్రతీ సంవత్సరం సుభాష్ చంద్రబోస్ పుట్టిన రోజు సందర్బంగా స్వాతంత్ర్య సమరంలో అసువులు బాసిన ఎందరో వీరుల సంస్మరణ నిమిత్తం "షహీద్ మేళ" జనవరి 23 నుంచి పిబ్రవరి 6 వరకు 15 రోజులు స్వాత్రంత్య ఉద్యమ స్పూర్తితో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం ఆ సమావేశం లో మాట్లాడటానికి జనవరి 23, 24 తేదిలలో వక్త గా మరియి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడానికి తేదిలలో  కాళ్ళ మండలం కోపల్లె ఉన్నత పాఠశాలలో ఉపాద్యాయినిగా పనిచేయిచున్న డాక్టర్ కేశిరాజు రాంప్రసాద్ ని ఆ సమావేశ నిర్వహణ  ట్రస్టి శ్రీ రాజ్ త్రిపాఠి ఆహ్వనిస్తూ లేఖ పంపారు.

 

ఈ షహీద్ మేళ  దేశభక్తి ని ఉద్దేశించి నిర్వహించబడుతున్నది. ఈ సమావేశ నిర్వహణ యువతరాన్ని ఉత్తేజపరచడానికి, ప్రేరణ ఇవ్వటానికి దోహద పడుతుందని మరియి స్వేచ్చా ప్రాముఖ్యత, సమైక్యత, దేశభక్తి , దేశం పట్ల బాద్యత మొద‌ల‌గు విషయాలు తెలపటానికి నిర్వ‌హిస్తున్నారు. అలాగే  దేశస్వాత్రంత్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు, వారి జీవిత చరిత్రలు తెలుసుకోవలసిన అవసరం ప్రస్తుత విద్యార్దులు అందరికి అవసరం వుంది. గతంలో డాక్టర్ కేశిరాజు రాంప్రసాద్ వియత్నాం, సింగపూర్, శ్రీలంక, దుబాయి దేశాలలో జరిగిన అంతర్జాతీయ సదస్సులలో మరియి మన దేశంలో జరిగిన కొల్ కతా, పూనే, హైదరాబాద్ మరియి  ఎన్నో నగరాలలో సమావేశాలలో మాట్లాడటం జరిగింది. 

 

దేశంలోనూ రాష్ట్రంలో వివిధ ఇంజినీరింగ్ కళాశాలలో, డిగ్రీ మరియు పిజి కళాశాలలో, N.S.S.సేవా శిబిరాలలో, ఇంగ్లీషు మీడియం పాఠశాలలో, వశిష్ట సేవాశ్రమం, సాంఘిక సంక్షేమ హాస్టల్స లలో, అనాధ శరణాలయాలలో 1000 కి పైగా వ్యక్తిత్వ వికాశ  ఉపన్యాసాలు ఇవ్వటం జరిగింది. `పిల్లల్ని విజేతలుగా చేయడం ఎలా, విజేతగా నిలిచిపో,  గెలుపుబాట` అనే వ్యక్తిత్వ వికాసానికి సంబందించి పుస్తకాలు రాశారు. వీరు రాసిన వ్యాసాలు వార్త  దినపత్రికలోను, ఆంధ్రప్రభ దినపత్రిక లోను, ఉజ్వల పక్షపత్రకలోను వీరి వ్యాసాలు విద్యార్దులను ఉద్దేశించి రాయడం జరిగింది.

 

వీరి పరిశోధన పత్రాలు `బిహేవియర్ ఐడేంటిఫికేషన్ సిద్దాంతం`,  `నేర్చుకొనే విధాన సిద్ధాంతం` ఎందరో ప్రముఖుల మన్నన పొందింది. వీరు దేశ భక్తికి సంబంధించిన K.M.మున్షి శత జయింతి ఉత్సవాలు నిర్వహణ, పండిట్ జవహర్ లాల్ నెహ్రు శత జయింతి ఉత్సవాలు, ఫ్రీడంమ్ ఫార్టి ర‌న్‌ని 1987 లో.. 5000 మందితో  భీమవరంలో నిర్వహించడం జరిగింది.  అలాగే పాలకొల్లులో దేశభక్తి ప్రేరణతో 5 కె రన్ ని 10000 మంది విద్యార్దులు పెద్దలతో రెండు సార్లు నిర్వహించడం జరిగింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: