ఏ నిమిషానికి ఏమి జరుగునో ఇంకెవరో అంటూ లవకుశ సినిమాలోని పాటను రిపిట్ చేసుకుంటున్నాడేమో మాజీ సీయం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే  ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిస్దితులను చూస్తుంటే ఒకప్పుడు తిరుగులేని నాయకునిగా ఉన్న బాబు ఇప్పుడు తిరుగుతున్న నాయకునిగా మారాడు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ క్రమ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది.

 

 

అంతే కాకుండా తెలంగాణలో అయితే తెలుగుదేశం పార్టీ అడ్రస్సు గల్లంతయ్యింది. ప్రస్తుతం ఈ పార్టీకి సరైన అడ్రస్‌ లేని అనాధగా తయారు ఐయ్యింది.. ఒకప్పుడు టీడీపీకి బోల్డంత క్యాడర్‌ వుండేది. ఇప్పుడు ఆ క్యాడర్‌ సత్తా కూడా తగ్గిపోయింది. పులిలా ఉన్న బాబు, పిల్లిలా మారాడు. ఇదే కాకుండా జగన్ వచ్చాక తెరపైకి వచ్చిన అమరావతి ఎపిసోడ్‌తో చంద్రబాబు తన స్థాయిని తానే తగ్గించేసుకున్నారు. అతిగా ప్రవర్తించి జోలె పట్టడం ద్వారా రాష్ట్ర ప్రజల మద్దతు కూడగట్టుకోవాలని ఆశించి, అభాసుపాలయ్యాడు..

 

 

అమరావతి రచ్చను భూతద్దంలో పెట్టి పెద్దగా చూపించాలని చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఇక అసెంబ్లీలో మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, అమరావతి పరిధిలో ఆ 29 గ్రామాల్లోనే అలజడి కన్పించింది తప్ప, రాష్ట్రంలో ఎక్కడా చిన్న పాటి కదలిక కన్పించలేదు. ఇటువంటి క్లిష్ట పరిస్దితుల్లో టీడీపీ కోలుకునే అవకాశాలే కన్పించడంలేదు. ఇక బాబోరి గారాల పుత్రుడు లోకేశం కూడా పప్పు ముద్ద అనే బిరుదును అంకితం చేసుకున్నాడు. ముద్ద ముద్ద మాటలతో ప్రత్యర్ధులను నవ్విస్తుండగా, లోకేశ్ ప్రచారనికి కనీసం గల్లి లీడర్లు కూడా రెస్పాన్స్ అవడం లేదట.

 

 

ఇదిలా ఉండగా శాసన సభలో సీఆర్‌డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు అమోదింప చేసుకున్న ప్రభుత్వం శాసన మండలిలో వీటి ఆమోదానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్  ప్రభుత్వ వైఖరిని తీవ్ర స్థాయిలో నిరసించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. తిరుగుబాటు మొదలైంది.. ఇక సమరమే, శాంతి యుతంగా నిరసనలు తెలుపుతున్న తమ పార్టీ నేతలను అరెస్టు చేస్తారా అంటూ ఓ వ్యాఖ్యను పోస్ట్ చేశారు.

 

 

ఇతని మాటలు విన్న అధికార పార్టీ నాయకులు కొందరు చాక్లెట్లు తినే పిల్లాడు చావుతెలివితేటలు ప్రదర్శిస్తున్నాడు. చేతులు కాలాక ఆకులుపట్టుకుని ఏం లాభం. చేయవలసిన అవినీతి చేసి అడ్దంగా బుక్కైయ్యాక ఇప్పుడు అధికారం కోసం అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్న లోకేశం గారి బెదిరింపులకు బుడ్దోడి చెడ్ది కూడా తడవడం లేదనుకుంటున్నారట...

మరింత సమాచారం తెలుసుకోండి: