జనం నాడి తెలుసుకుని...  జనం మెచ్చిన నాయకుడుగా... జనం కోసం కదలి... జనరంజక పాలన అందిస్తున్నారు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అసలు సిసలైన పాలన అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నారు. నాటితరం ఆలోచనలతో కాకుండా నేటి తరం యువ ఆలోచనలను ఆచరణలో పెట్టి... ఎన్నో   సంచలనాత్మక పథకాలను ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారూ . ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంటే కేవలం రాష్ట్రానికి సీఎం మాత్రమే కాదు పేద ప్రజలకు ఒక ధీమా  అని ప్రజలందరూ భావించేలా జగన్ పాలన అందిస్తున్నారు . మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. జగన్ అధికారంలోకి వస్తే రాజన్న పాలన వస్తుంది అని నమ్మిన ప్రజలందరికీ రాజన్న పాలన కు మించిన పాలనే అందిస్తున్నారు  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 

 

 

 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి... పేద ప్రజలకు చేయూత నిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పేద కుటుంబంలో తమ పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు ఎక్కడ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రతి ఏటా విద్యార్థుల తల్లి ఖాతాలో  15 వేల రూపాయలు జమ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. ఇక ఆ తర్వాత బడికి వెళ్ళిన పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారు. ఇక పేద విద్యార్థులు సరైన భోజన వసతి లేక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సరికొత్తగా  మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 

 

మధ్యాహ్న  భోజన పథకాన్ని ప్రవేశపెట్టి పౌష్టికాహారం అందించేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయించారు. ఇక తాజాగా స్కూల్ విద్యార్థుల కోసం మరో వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టనుంది  జగన్ సర్కార్. జగనన్న విద్యా కానుక అనే పేరుతో సీఎం జగన్ కొత్త పథకానికి ఊపిరి పోయనున్నారు . జగనన్న విద్యా కానుక పథకం ద్వారా స్కూల్ విద్యార్థులందరికీ ఒక స్కూల్ బ్యాగ్ మూడు జతల యూనిఫాం సరిపడా క్లాత్.. కుట్టు కూలీ, షూస్, సాక్స్  ఒక బెల్ట్ , పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ అన్ని అందజేయనున్నారు. బడికి  వెళ్లి పేద విద్యార్థులకు యూనిఫాం నోట్ బుక్స్ లేక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది జగన్ సర్కార్. ఇక ఇప్పటికే హాస్టల్లో ఉండి చదువుకున్న వారికి ప్రతి ఏటా 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: