కొంతమందికి ఫుడ్ చూస్తే అస్సలు మనసు ఊరుకోదు.  ఎలాగైనా తినాలి అనుకుంటూ ఉంటారు. ఇక ఆఫీస్ లలో అయితే పక్కన ఉన్న వ్యక్తులకు సంబంధించిన ఫుడ్ ను కూడా తీసుకొని తినేస్తుంటారు.  ఎలాంటి మొహమాటం ఉండదు.  ఇలానే ఓ ఆఫీస్ లో ఓ వ్యక్తి తన పక్కన ఉండే వ్యక్తుల బాక్స్ లను కూడా తీసుకొని తినేస్తుంటాడు.  ఓసారి ఫుడ్ తిన్న తరువాత ఎందుకో మగతగా ఉందని చెప్పి వెళ్లి కేబిన్ లో కూర్చున్నాడు.  కూర్చున్న చోటనే కుప్పకూలిపోయాడు.  


అంతే... అక్కడి నుంచి కోమాలోకి వెళ్ళాడు. కోమాలోకి వెళ్లిన అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు.  ఆరోజు నుంచి సదరు వ్యక్తి కోమాలోనే ఉన్నారు. 2016 నుంచి అయన కోమాలో ఉండిపోయాడు.  కోమాలో ఉండిపోయాడు.  ట్రీట్మెంట్ ఇస్తున్నా చలనం లేదు.  అయితే, అతని టెస్ట్ చేసిన వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు.  అతని కడుపులో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని ఆ రసాయనాలు ఎలా వచ్చాయో తెలియదని, దానిపై పోలీసులు ఆరా తీయాలని అన్నారు. 


ఆరోజు నుంచి పోలీసులు ఈ కేసును సవాల్ గా తీసుకున్నారు.  ప్రతిరోజూ ఆఫీస్ లో అతను తోటి ఉద్యోగులతో కలిసి భోజనం చేసేవారు.  ఎవరైనా అతనికి విషయం పెట్టరేమో అని ఆరా తీశారు.  అలాంటిది ఏమి లేదని తేలిపోయింది.  పోలీసులు అందరిని విచారిస్తుండగా అదే ఆఫీస్ లో ఓ వ్యక్తి ఇచ్చిన శాండ్ విచ్ తిన్న తరువాత సదరు వ్యక్తి కోమాలోకి వెళ్లారని సమాచారం తెలిసింది.  దీంతో పోలీసులు దీనిపై ఆరాతీయడం మొదలు పెట్టారు.  

 

సదరు వ్యక్తిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.  ఆ వ్యక్తి శాండ్ విచ్ లో పాదరసం కలిపి ఇచ్చారని, అలా రోజు శాండ్ విచ్ లో పాదరసం కలిపి ఇవ్వడంతో బాధితుడు కోమాలోకి వెళ్లినట్టుగా నిర్ధారణ అయ్యింది.  అలా ఆఫీస్ లో చాలామందికి అలానే ఇచ్చేవాడని, ఆయన సాండ్ విచ్ తిన్న చాలామంది అనారోగ్యం బారిన పడ్డారు.  కొంతమందికి కిడ్నీలు పాడయ్యాయి.  దీంతో కోర్టు అతనికి బతికున్నంతకాలం జైల్లో ఉండేలా శిక్ష విధించింది.  అయితే, ఈ తీర్పు వెలువడే నాటికి బాధితుడు మరణించాడు.    

మరింత సమాచారం తెలుసుకోండి: