అసెంబ్లీలో అధికారమదంతో మూడురాజధానుల బిల్లుని ఆమోదించిన వైసీపీ ప్రభుత్వానికి, మండలిలో టీడీపీసభ్యులు కర్రుకాల్చివాత పెట్టారని, భాధ్యతగల మంత్రు లు వీధిరౌడీల్లా ప్రవర్తిస్తూ, మండలిలో రూల్‌-71పైచర్చ జరక్కుండా అడ్డుకోవాలని చూశారని టీడీపీసీనియర్‌నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డా రు. రూల్‌-71పై శాసనమండలిలో చర్చ జరగకుండా జగన్‌ప్రభుత్వం ద్రౌపదీవస్త్రాపహరణం మాదిరిగా ప్రజాస్వామ్య అపహరణకు పాల్పడిందని ఆయన దుయ్యబట్టారు. 


మంత్రులు ఎంతగా గొంతుచించుకున్నా, చిందులేసినా రూల్‌-71పై చర్చ జరుగుతుందని ఉమా స్పష్టంచేశారు. ఏ1-ఏ2లు చర్చలు జరపడం, మండలిలో విజయసాయిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి పచార్లుచేయడం ఎందుకోసమో చెప్పాల న్నారు. రిపబ్లిక్‌డే పరేడ్‌ విశాఖనుంచి విజయవాడకు తరలివచ్చినట్లుగానే, రాజధాని కూడా విశాఖకు వెళ్లినదానికన్నా తొందరగా తిరిగి అమరావతికే వస్తుందని ఉమా తేల్చిచెప్పారు. రూల్‌-71పై చర్చకోసం గంటలతరబడి అమ్మఒడిపేరుతో అసెంబ్లీని సాగదీశారని, లేనిపథకాల జపంచేస్తూ, మంత్రులు, వైసీపీసభ్యులంతా జగన్‌జపం చేయడమే పనిగా పెట్టుకున్నారని దేవినేని ఆక్షేపించారు. 

 

కొడాలినాని, ఇతరమంత్రుల భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్న ఆయన, మమ్మల్ని చావమంటున్న మంత్రులను , వైసీపీని భూస్థాపితం చేసేవరకు తమకు చావురాదన్నారు. నాని మంత్రిపదవి అనుభవిస్తున్నాడంటే, అది చంద్రబాబు ఆయనకు ఇచ్చిన రాజకీయభిక్షవల్లేనన్నారు.  ఏ1-ఏ2లు అత్యవసరభేటీలు జరపడం, విజయసాయిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డిలు మండలి లో మంతనాలు జరపడం ఎందుకోసమని ఉమా ప్రశ్నించారు. 23వతేదీకల్లా జగన్‌కు మూడురాజధానుల ముచ్చటతీరిపోతుందని, విశాఖలో రాజధాని కథ కంచికి చేరుతుందని, 23తర్వాత ఆయనకు ఏలిననాటి శని ఆరంభమవుతుందని ఉమా ఎద్దేవాచేశారు. ఎంపీ అనికూడా చూడకుండా గల్లాపై తప్పుడుకేసులుమోపి, నిన్న ఉదయం 11.30నుంచి, తెల్లవారుజామున 3గంటలవరకు ఆయనపట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించారన్నారు. 

 

341, 353, 143, 32 ఆఫ్‌ పోలీస్‌యాక్ట్‌ వంటి  తప్పుడుసెక్షన్లు పెట్టి, టీడీపీనేతలపై అత్యంతఅమానుషంగా ప్రవర్తించారని ఉమా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయిస్తున్నా, న్యాయస్థానాలు న్యాయం వైపే నిలవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రైతులు, మహిళలు, రైతుకూలీల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న జగన్‌ప్రభుత్వానికి వారి ఉసురుతప్పక తగులుతుంద  న్నారు. 24మంది రైతులు, రైతుకూలీలు చనిపోయినా, రాజధానిప్రాంతమంతా రణరం గంలా మారినా జగన్‌లో, ఆయనమంత్రుల్లో కనీసం పశ్చాత్తాపం లేకపోవడం విచారక  రమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. 


హైదరాబాద్‌లో తనకున్న భూములు, తన ఆధ్వర్యంలో తన అనుమాయులు నిర్మిస్తున్న ఫ్లాట్స్‌, భవనాలు అమ్ముకోవడానికే ముఖ్యమంత్రి పక్కరాష్ట్రానికి సహకరిస్తున్నాడన్నారు. విశాఖలో గయాలిభూములు సహా 52వేల ఎకరాలవరకు కాజేశారని, అధికారుల సాయంతో అడ్డగోలుగా భూములు పోగేశారని ఉమా దుయ్యబట్టారు. స్వాములు చెప్పారని, రాజధానులు మార్చినంత మాత్రాన జగన్‌ తానుచేసిన స్కాముల్లోంచి బయటపడలేరన్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: