ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో టీడీపీ పంతం నెగ్గించుకుంది . మండలిలో రూల్ 71 పై టీడీపీ సభ్యులు చర్చకు పట్టుపట్టగా ,   చర్చకు చైర్మన్ షరీఫ్ అనుమతి ఇచ్చారు . టీడీపీ సభ్యడిని మాట్లాడాలని చైర్మన్ సూచించగా మంత్రులు , పోడియం వద్దకు చేరుకొని ఆందోళన దిగడంతో సభ వాయిదా పడిన విషయం తెల్సిందే .  స్పీకర్ రూలింగ్ పై ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు . ఇది ఒక సంప్రదాయంగా మారిపోతుందని , ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టిన ప్రతిసారి రూల్ 71 ను తెర మీదకు తెస్తున్నారని అసహనాన్ని వ్యక్తం చేశారు .  

 

అంతకుముందు గందరగోళం నడుమ పరిపాలన వికేంద్రీకరణ , సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రులు ప్రవేశపెట్టారు . పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , సీఆర్డీఏ రద్దు బిల్లును మున్సిపల్ శాఖమంత్రి బొత్స సత్యనారాయణలు ప్రవేశపెట్టారు . మంత్రులు ప్రవేశపెట్టిన బిల్లును పరిగణలోకి తీసుకున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించగానే, టీడీపీ సభ్యులు పోడియం వద్దకు దూసుకువచ్చి ఆందోళనకు దిగారు . రూల్ 71 పై చర్చకు నోటీసు ఇచ్చినా  మంత్రులు ప్రవేశపెట్టిన బిల్లులను పరిగణలోకి తీసుకోవడం పట్ల టీడీపీ సభ్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ , ఆందోళనకు దిగడంతో మండలి చైర్మన్ చర్చకు అనుమతించారు . రూల్ 71  పై చర్చకు అనుమతిచ్చిన చైర్మన్ , రెండు గంటల సమయాన్ని  కేటాయించారు . రూల్ 71  పై చర్చను టీడీపీ సభ్యుడు బాబు రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు .

 

మండలిలో ఏమి జరుగుతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది . మండలి లో టీడీపీ కి మెజార్టీ ఉండడంతో , పరిపాలన వికేంద్రీకరణ బిల్లును పాస్ కాకుండా అడ్డుకునే అవకాశాలున్నాయనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు . ఇక  మండలి కార్యకలాపాలను ఉత్కంఠ తట్టుకోలేక  అధికార, విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గ్యాలరీలో కూర్చొని ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: