పాపం.. అని అనకూడదు కానీ.. ఈ ఘటన చదివితే మీ కంట కూడా కన్నీరు ఆగదు.. ఆ అమ్మాయి తండ్రి లేని పిల్లా.. అబ్బాయి తల్లితండ్రులు లేని పిల్లడు.. అందుకే అమ్మాయి తల్లి అమ్మాయిని బాగా చూసుకోవాలని.. ఆలా చూసుకునే వాడికే ఇచ్చి పెళ్లి చెయ్యాలని అనుకుంది.. అబ్బాయి తల్లి తండ్రులు లేకపోవడంతో అక్కనే అతని ఆలనా పాలనా చూసుకుంది.    

 

అయితే.. అతని బాగోగులు మరో అక్క చూసేది. అందుకే ఆమె కోసం అతను తరచూ వాళ్ళ ఉరికి వెళ్ళేవాడు.. ఆ సమయంలోనే అతని ఓ అమ్మాయిని చూశాడు.. అప్పుడే ఆమెతో ప్రేమలో పడ్డాడు.. ఆమె కూడా అతన్ని ప్రేమించింది. పెళ్లి చేసుకొని జీవితాంతం ఉండాలనుకున్నారు... కానీ విధి ఆడిన వింత నాటకంలో వారి ప్రేమ ఫలించలేదు.        

 

అమ్మాయికి పెళ్లి అయ్యింది.. అబ్బాయి ఒంటరి అయ్యాడు.. అయినా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఇంకో నెలలో పోస్టింగ్. ఇంతలోనే ఆ అమ్మాయి సంక్రాంతి పండుగకు అని ఊరికి వచ్చింది. అక్కడ ఇద్దరు ప్రేమికులు కలుసుకున్నారు.. మాట్లాడుకున్నారు. 6 నెలలు తర్వాత కలిసిన ఇద్దరు..       

 

కలిసి బతకలేం.. కనీసం ఇద్దరం కలిసి చద్దాం అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఇద్దరు.. ఏ చెట్టుకి అయితే వారి ఇద్దరి పేర్లు రాసుకున్నారో ఆ చెట్టుకే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఊర్లో వారందరిని శోకసంద్రంలోకి నెట్టింది.. వారి మృతుదేహాల వద్దకు చేరుకున్న బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.. వారు అనుకున్నట్టు అతనికి ఆరు నెలల ముందు ఉద్యోగం వచ్చిన.. ఆమెకు పెళ్లి కాకపోయినా ఈరోజు ఈ వార్త వచ్చేది కాదు.. కానీ విడి ఆడిన వింత నాటకంలో ఆ ప్రేమికులు ఇద్దరు బలయ్యారు.     

మరింత సమాచారం తెలుసుకోండి: