బెంగుళూరు సిటీలో కోర‌మంగ‌ల‌కు ఒక ప్ర‌త్యేక‌మైన  పేరు ప్ర‌తిష్ట‌లు ఉన్నాయి.  ఇప్పుడు అదే కోరమంగల పేరుతో విచ్చలవిడిగా (ఎస్కార్ట్స్) వెబ్ సైట్లు తెర మీదకు రావడంతో స్థానికుల‌కు గుబులుపుడుతుంది. ఈ సెక్స్ రాకెట్ పేరుతో వెబ్ సైట్లు ఇలానే కొన‌సాగితే ఇక్క‌డ ఉన్న స్థానికులు కొన్ని కుటుంబాలు ఇక్క‌డ ఉండ‌టం చాలా క‌ష్ట‌మ‌ని భ‌య‌ప‌డుతున్నారు. ఇప్పటికే  ఈ ఘ‌ట‌న పై ఆ ప్రాంత ప్రజలంతా క‌లిసి స్థానిక శాసన సభ్యుడు, మాజీ హోమ్ మంత్రి అయిన  రామలింగా రెడ్డిని కలిసి ఈ విషయం గురించి ఆయ‌న‌తో చ‌ర్చించారు. 

 

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ఇలాంటి అసాంఘిక కార్య‌క్ర‌మాలు వ‌చ్చే వెబ్‌సైట్ల‌ను చూసి స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు.  అందమైన అమ్మాయిల అర్దనగ్నంగా ఉన్న ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, ఆ ఫోటోలు తీసుకొచ్చి వెబ్ సైట్లలో పెట్టారు. ఆసిఫా 733...........111  అనే ఓ పేరుతో సోషల్ మీడియాలో అక్రమ కార్యకలాపాలు, సెక్స్ రాకెట్ దందా జరుగుతోందని స్థానికుల గుర్తించారు. ఈ ఘ‌ట‌న పై కాస్త స్పందించి ఎలాగైన దీని గురించి ప్ర‌భుత్వంతో మాట్లాడ‌మ‌ని మాజీ హోమ్ మంత్రికి ఫిర్యాదు చేశారు. 

 

ఈ వెబ్ సైట్ల‌లో అమ్మాయిల పేర్లు, ఇ మెయిల్ అడ్రస్ లు దర్శనం ఇస్తున్నాయి. వెబ్ సైట్లలో అమ్మాయిల ఫోటోలతో పాటు వారితో ఎంజాయ్ చెయ్యడానికి కొందరు రేట్లు పిక్స్ చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయం కొన్ని వెబ్ సైట్ లింక్ లో ఓపెన్ చేస్తే అది నిజమే అనే విషయం వెలుగు చూసింది. కొందరు యువకులు అశ్లీలంగా అమ్మాయిలతో గడుపుతున్న సమయంలో వీడియోలు తీసి అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తున్నారని ఆరోపణలు, ఫిర్యాదు చేశారని తెలిసింది. ఇంత జ‌రుగుతున్నా కూడా పోలీసులు నిమ్మ‌కు నీరెక్క‌న‌ట్లు ఉంటున్నారు. ఇక అలాగే వెబ్ సైట్ లింగ్  ఓపెన్ చెయ్య‌గానే అమ్మాయిల రేట్లు చూస్తే హ‌డ‌లిపోవాల్సిందే... అలాగే ఎంత కాస్ట్ పెట్టి కొంటే అంన సేపు ఎంజాయ్ అన్న‌ట్లు ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: