దక్షణాది రాష్ట్రాల్లోని పార్లమెంట్ సభ్యులకు టైం బాగున్నట్టు లేదు.. మొన్నేమో తెలుగు దేశం పార్టీ ఎంపీ గళ్ళ జయదేవ్ పైన ఓ ఐపిఎస్  అధికారి తన చేతి వాటం చూపించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో నిజానిజాలు ఎలా ఉన్నా.. మరో ఎంపీని పట్టుకుని వెళ్లుమని పీకిన సంఘటన తెలుగులోకి వచ్చింది. ఇదే విషయమై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బీజేపీ నేత చెంప పగల కొట్టిన దమ్మున్న కలెక్టర్లు అంటూ నెటిజనులు తెగ పొగిడేస్తున్నారు. జిల్లా కలెక్టర్ నివేధిత. డిప్యూటీ కలెక్టర్ ప్రియా వర్మలను తమ ప్రశంసల జల్లుతో ముంచెత్తున్నారు.

అసలేం జరిగిందంటే.. దేశ వ్యాప్తంగా పౌరసత్వం బిల్లుపై నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసింది. అందులో భాగంగా అనుమతి లేకుండా ఆందోళన చేపట్టిన ప్రజాప్రతినిధులను పది మందిలో పట్టుకుని పెల్లున పీకిన మహిళా ఉన్నతాధికారుల ఉదంతమిది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అనుమతులు లేకుండా సిఏఏ, ఎన్ ఆర్ సి బిల్లులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీ తెచ్చిన పితలాటకమిది. ర్యాలీ సరే.. జిల్లా కలెక్టర్ పై దురుసుగా ప్రవర్తించిన బీజేపీ నాయకుడి చెంప చెళ్లు మనిపించింది ఓ దమ్మున్మ కలెకర్ట్.

వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ లో అనుమతి లేకుండా బీజేపీ నాయకులు తిరంగా యాత్రను నిర్వహించారు. ఈ ర్యాలీకి అధికారులు అనుమతి ఇవ్వలేదు. అనుమతి తీసుకోకుండా ర్యాలీ ఎలా నిర్వహిస్తారని రాజ్ గఢ్ కలెక్టర్ నివేధిత తిరంగా యాత్రను అడ్డుకున్నారు. దీంతో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు కలెక్టర్ తో ఘర్షణకు దిగారు.

కలెక్టర్ తో దురుసుగా ప్రవర్తించారు. దీంతో కలెక్టర్బీజేపీ నేత చెంప పగల కొట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. దీనిపై ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. భాజపా నేత అరెస్టు  అనంతరం జరిగిన బీజేపీ నేతలు, కార్యకర్తల ఆందోళనను డిప్యూటీ కలెక్టర్ ప్రియా వర్మ  అడ్డుకున్నారు. అందులో రెచ్చిపోయిన ఆందోళనకారుల జుట్టుపట్టి  లాగి మరి మక్కెలు ఇర్రాకొట్టరు. ఈ సంఘటన పరంపర ఆ జిల్లాలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేకేస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: