ఒక్కోసారి కాలం కలిసి రాకపోతే తాడే తాటి పాములా మారి కాటేస్తుంది. ఇప్పుడు ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు అదేవిధంగా తయారయ్యాయి. మొన్నటి వరకు తమ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు తిరిగి తమపైనే తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాడు. ఈ పరిణామాలు  చంద్రబాబుకు అసహనం కలిగిస్తున్నాయి. అసలు అసెంబ్లీలో వల్లభనేని వంశీ మాట్లాడు బోతున్నారు అంటే చాలు టీడీపీ అధినేత చంద్రబాబు ముందుగానే అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళి పోతున్నాఋ. వంశీ భయం చంద్రబాబులో ఎక్కువయినట్టుగా కనిపిస్తోంది. 


చంద్రబాబును తీవ్రస్థాయిలో విమర్శించడమే కాకుండా, ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస పార్టీకి మద్దతుగా వంశీ మాట్లాడ్డం టిడిపి నాయకులకు రుచించడం లేదు. తాజా అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి నాయకుల వెనక బెంచ్ లోనే వంశీ కూర్చుంటూ,  వారికి వ్యతిరేకంగా మాట్లాడుతుండడం టీడీపీ నాయకులకు ఆగ్రహం కలిగిస్తోంది. తాజాగా  నిన్న అసెంబ్లీలో వంశీ మాట్లాడుతూ జగన్ ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకాన్ని ప్రస్తావిస్తూ ఈ పథకాన్ని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. అయితే ఆయన ఈ మాటలు మాట్లాడిన సందర్భంగా చంద్రబాబు సభలో లేరు ఉంటే ఆయన ముఖంలో అసహనం స్పష్టంగా కనిపించేది. 


 వంశీ తన పై వివాదం వ్యాఖ్యలు చేస్తారని ముందుగానే గ్రహించిన చంద్రబాబు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయినట్లు వైసిపి నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. వాస్తవానికి టీడీపీకి రాజీనామా చేసిన వంశీ వెంటనే వైసీపీలో చేరతారని ముందుగా అందరూ ఊహించారు. కానీ జగన్ పెట్టిన నియమం ప్రకారం ఎవరైనా పార్టీ లోకి రావాలంటే ముందుగా వారు పదవులకు రాజీనామా చేయాల్సిందే. దీని కారణంగానే వంశీ వైసీపీలో చేరకుండానే ఆ పార్టీకి మద్దతుదారుడిగా  ఉంటున్నారు.


 ఇక టిడిపిపైనా వంశీ అదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు గాని, ఆ పార్టీ నాయకులు కానీ వంశీని గట్టిగా విమర్శించలేక, ఆయన చేసిన వ్యాఖ్యలు భరించలే,క బాగా ఇబ్బందికి  గురవుతున్నారు. పాపం చంద్రబాబుకు ఈ వయసులో ఎన్ని కష్టాలో అని కొంతమంది జాలి చూపిస్తుంటే... మరికొందరు మాత్రం చేసిన పాపాలు ఊరికే పోతాయా అంటూ నిట్టూరుస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: