డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్.. భారత భాగ్యవిదాత, న్యాయకోవిదుడు, సామాజిక వేత్త. ఆయన భారత సమాజం గురించి ఎంతో పరిశోధన చేశాడు. ఆయన న్యాయశాస్త్రాన్ని ఆపోసన పట్టాడు. అందుకే భారత రాజ్యాంగాన్ని రాసే అవకాశం ఆయనకు దక్కింది. ఆయన చెప్పిన అనేక వి।షయాలు, అంచనాలు కాల పరీక్షలో నెగ్గాయి. కుల తత్వాన్ని, మత తత్వాన్ని బాగా వ్యతిరేకించిన ఆయన.. ఆ అంశాలపై అనేక గ్రంధాలు రాశారు.

 

కులం పునాదులపై, మతం పునాదులపై మనం రాజ్యాలను నిర్మించలేం అంటాడు అంబేడ్కర్. ఈ సూక్తి చాలా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు అమరావతి విషయంలో అది మరోసారి రుజువైందని చెప్పాలి.అంబేద్కర్ కుల జాడ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. కులం పునాదుల మీద నిర్మించే ఏ వ్యవస్థ నిల‌బ‌డ‌ద‌ని చెప్పారు.. ఇప్పుడు బాబోరి క‌ల‌ల కుల పునాదుల మీద నిర్మించాలని భావించిన భ్రమ‌రావ‌తి ఆదిలోనే కుప్పుకూలిందన్న వాదన వినిపిస్తోంది.

 

విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఓ మహత్తర అవకాశం లభించింది. రాజధాని లేకుండా ఏర్పడిన రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మించే లేదా.. అభివృద్ధి చేసే అవకాశం దక్కింది. ఆయనే చాలా సార్లు చెప్పినట్టు ఇలాంటి మహత్తర మైన అవకాశం చరిత్రలో చాలా తక్కువ మందికి వస్తుంది. కానీ చంద్రబాబు దాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారనే చెప్పాలి.

 

స్వార్థరహితంగా రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా ఓ రాజధానిని నిర్మించే ప్రయత్నాన్ని చంద్రబాబు చేసి ఉంటే చరిత్రలో నిలిచిపోయేవారు. అన్ని పార్టీలనూ కలుపుకుని.. అందరి అభిప్రాయాలు తీసుకుని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని కొత్త రాజధాని నిర్మాణానికి పూనుకుని ఉంటే బావుండేది. కానీ చంద్రబాబు అలా కాకుండా తన స్వార్థంతో, తన కులానికి మేలు జరగాలన్న ఉద్దేశ్యంతోనే అమరావతిని కృష్ణా, గుంటూరు జిల్లాలో నిర్మించాలని తలచారన్న విమర్శలు చాలా వచ్చాయి. ఆ విషయం జనం గమనించారు. అందుకే గత ఎన్నికల్లో ఆయన్ను చిత్తుగా ఓడించారు. ఇప్పుడు ఆయన నిర్మించాలనుకున్న భ్రమరావతి ఓ భ్రమగా మిగిలిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: