వైఎస్ జగన్ సర్కారు విద్య విషయంలో అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం విద్య.. ఇలా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు ఇదే ఒరవడిలో

మరో స్కీమ్ తీసుకొచ్చింది. దాని పేరు జగనన్న గోరుముద్ద. అయితే ఇది పూర్తిగా కొత్త పథకం కాదు. ఇప్పుడు అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకమే.

 

కాకపోతే.. ఇందులో మార్పు తీసుకువస్తున్నారు. ప్రతి రోజు కూడా ఏమి పెడుతారన్నది కూడా పరిశీలించి..పిల్లల్లో భోజన నాణ్యతను పెంచుతూ ప్రతి రోజు ఒకరకమైన భోజనం పెట్టేలా మెనూ మార్పు చేశారు. ఈ పథకం గురించి స్వయంగా జగన్ అసెంబ్లీలో వివరించారు. ఆయన ఏమన్నారంటే.. “ ముఖ్యమంత్రి కూడా పిల్లలు ఏం తింటున్నారు. రోజు ఇదే భోజనం ఎలా తింటారని ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేసి ఉండరు. ఆ మాత్రం పిల్లలను పట్టించుకోకపోతే చదువులు చెప్పించలేం. ఈ కార్యక్రమంలో నేను కూడా ఎక్కువగా ఇన్వాల్వ్‌ అయ్యాను. ప్రతి రోజు మెనూ మార్పు చేస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకానికి జగనన్న గోరుముద్ద అని నామకరణం చేస్తున్నామన్నారు.

 

ఈ పథకంలోని ఆయాలకు గతంలో కేవలం రూ.1000 ఇచ్చేవారు. అది కూడా బకాయిలు పెట్టేవారు. ఆరు నుంచి 8 నెలల వరకు బిల్లులు ఇచ్చేవారు కాదు. సకాలంలో బిల్లులు ఇవ్వకపోతే క్వాలిటీ ఎక్కడ ఉంటుంది. అందుకే ఆయాలకు ఇచ్చే రూ.1000ని రూ.3000 పెంచాం. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని ఈ ప్రోత్సాహకం పెంచాం. మధ్యాహ్న భోజన పథకానికి రూ.344 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది. అయినా కూడా పిల్లలకు ఖర్చు చేస్తే ఎక్కువ కాదని మనస్ఫూర్తిగా భరిస్తున్నామన్నారు జగన్.

 

భోజన నాణ్యతను పరిశీలించేందుకు నాలుగు దశలను ఏర్పాటు చేశారు. పేరెంట్‌ కమిటీలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నుంచి సబ్‌ కమిటీగా ఏర్పాటు చేస్తారు. వీరు మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలిస్తారు. గ్రామ సచివాలయంలో ఉన్న విద్యాశాఖ వెల్పేర్‌ అసిస్టెంట్‌కు కూడా ఆదేశాలు ఇచ్చారు. రోజు మరిచి రోజు స్కూల్‌కు వెళ్లి క్వాలిటీ వెళ్లాలి. ప్రతి రోజు హెచ్‌ఎం ఆధ్వర్యంలో రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: