అమరావతిలో దీక్షలు నిరసనలు చేస్తూ రాజధాని అమరావతి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో పోరాడుతున్న చంద్రబాబు... వికేంద్రీకరణ వల్ల ప్రపంచంలో ఏ దేశం బాగు పడిన దాఖలాలు లేవని దయచేసి అమరావతిలోనే రాజధాని ఉంచాలంటూ జగన్ ని కోరడం జరిగింది. అయితే వైయస్ జగన్ మాత్రం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి మొత్తం హైదరాబాద్ నగరానికే పరిమితం కావడంతో ఆంధ్రా - తెలంగాణ రాష్ట్రాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడంతో భవిష్యత్తులో మళ్లీ అటువంటి తప్పు జరగకూడదని వికేంద్రీకరణ పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటుకి అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందేలా చాకచక్యం గా వ్యవహరించారు.

 

దీంతో అమరావతిలో రాజధాని ఉంచుతూనే చట్టసభలు చట్టాలు ఈ ప్రాంతంలోనే అమలు అయ్యే విధంగా వ్యవహరిస్తూనే విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తూ కర్నూలు జుడిషియల్ క్యాపిటల్ గా ఎంపిక చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో విజయవాడ ప్రాంతంలో ఉన్న ప్రజలు అమరావతిలో రాజధాని తరలిం చేస్తున్నారు అన్న అభద్రతాభావంతో ఉన్న క్రమంలో ప్రజలకు ఉన్న అభద్రతా భావాన్ని తొలగించడానికి విశాఖపట్టణంలో చేయాలని భావించిన గణతంత్ర దినోత్సవ వేడుకలను జనవరి 26వ తారీఖున విజయవాడ లోనే చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించడంతో ఆరోజు తెలుగుదేశం పార్టీ నేతలు అలాగే చంద్రబాబు మనుషులు కొంతమంది విజయవాడ లో జరగబోయే రిపబ్లిక్ డే పెరేడ్ ని చెడగొట్టే పనిలో ఆలోచనలో ఉన్నట్లు వార్తలు రావడంతో విజయవాడలో 144 సెక్షన్ పెట్టడానికి పోలీసులు ప్లాన్ చేస్తున్నట్లు శాంతిభద్రతల నేపథ్యంలో ముందుగా చంద్రబాబుని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

ఏదిఏమైనా విజయవాడ లో జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమరావతి రాజధాని రైతులతో పాటు విజయవాడ ప్రాంతంలో ఉన్న చంద్రబాబు వర్గీయులు గణతంత్ర దినోత్సవ వేడుకలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: