ఈ మధ్య కాలంలో వావీవరసలు మరచి కామంతో కళ్లు మూసుకుపోయి అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు పెరిగిపోతున్నాయి. రాజస్థాన్ లో కూతురిపై అత్యాచారానికి పాల్పడి చంపేసిన కసాయి తండ్రికి మరణ శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. కూతురిని గర్భవతిని చేసిన తండ్రి ఆ విషయం బయటకు వస్తుందేమో అనే భయంతో ఆమెను హత్య చేసి చంపేశాడు. కోర్టు సభ్య సమాజంలో బ్రతకటానికి ముద్దాయికి అర్హత లేదని పేర్కొంటూ మరణ శిక్ష విధించింది. 
 
పూర్తి వివరాలలోకి వెళితే రాజస్థాన్ రాష్ట్రంలోని కోట గ్రామంలో ఒక వ్యక్తి వాచ్ మెన్ పని చేసి జీవించేవాడు. అతనికి మానసిక వికరాంగురాలైన కూతురు ఉండేది. మానసిక వికరాంగురాలైన కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి కూతురు గర్భం దాల్చటానికి కారణమయ్యాడు. కూతురు తన వలన గర్భం దాల్చిందనే విషయం బయటకు తెలిస్తే తన పరువు పోతుందని కసాయి తండ్రి భావించాడు. 
 
కూతురిని హత్య చేస్తే ఈ విషయం ఎప్పటికీ బయటకు రాదని అనుకొని కూతురిని హత్య చేశాడు. ఆ తరువాత సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి మానసిక వికలాంగురాలైన తన కూతురిని ఎవరో హత్య చేశారని ఫిర్యాదు చేశాడు కసాయి తండ్రి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు పంపించారు. 
 
పోస్టుమార్టం చేసిన వైద్యులు చనిపోయిన బాలిక గర్భంతో ఉందనే విషయాన్ని వెల్లడించారు. పోలీసులు ఆమె గర్భానికి కారణమైన వ్యక్తే ఆమెను హత్య చేసి ఉండవచ్చని భావించారు. పిండాన్ని ఫోరెన్సిక్, డీ.ఎన్.ఏ పరీక్షలకు పంపించగా రిపోర్టులో బాలిక తండ్రే గర్భానికి కారణమయ్యాడని తేలింది. పోలీసులు బాలిక తండ్రిని అదుపులోకి తీసుకొని విచారించగా అతను తానే తన కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డానని గర్భం దాల్చటంతో హత్య చేశానని అంగీకరించాడు. కూతురిని కన్న తండ్రే కడుపు చేసి హత్య చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించి ముద్దాయికి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: