తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు జరుగబోతున్న మున్సిపల్ ఎన్నికలకు రంగం అంతా సిద్దమైంది.. మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఈ రోజు అనగా బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు  పోలింగ్‌ మొదలు కానున్నది.. ఇదిలా ఉండగా అధికారులు నిన్న మంగళవారం సాయంత్రానికే అన్ని పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది, బ్యాలెట్‌ పత్రాలు, ఎన్నికల సామగ్రిని చేరవేశారు. ఇక ఈ సందర్భంగా పోలింగ్‌ కేంద్రాలన్నీ తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, గట్టి బందోస్తును ఏర్పాటు చేశారు.

 

 

ఇందులో భాగంగా పోలింగ్‌ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను విధించారు. ఇక 7,961 పోలింగ్ కేంద్రాల్లో, 6188 మున్సిపాలిటీల్లో, 1773 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇకపోతే 2,647 మున్సిపాలిటీల వార్డులు, 324 కార్పొరేషన్‌ వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక మొత్తం ఈ ఎన్నికల్లో 53,50,255 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని సమాచారం. కాగా ఈ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగడంకోసం మొత్తం 45 వేల మంది సిబ్బంది పనిచేస్తుండగా భద్రతకోసం 50 వేల మంది పోలీసులను నియమించారు. ఈ రోజు ఎలక్సన్స్ జరుగుతుండగా, ఓట్ల లెక్కింపు ఈ నెల 25న చేయనున్నారు.

 

 

ఇక కరీంనగర్‌ కార్పొరేషన్‌లోని 60 వార్డుల్లో, రెండు  వార్డుల్లో ఏకగ్రీవంగా ఉండగా. మిగతా 58 వార్డుల్లో 371 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కాగా ఇక్కద ఈ నెల 24 పోలింగ్‌ జరుగనుంది.. ఇక అధికార పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికలను, పోటీ చేసే అభ్యర్ధులు కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తిసుకుని, ప్రచారం నిర్వహించారు. కాగా ఈ ఎలక్షన్స్ లో భాగంగా పోలింగ్‌ కేంద్రాలవద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల ద్వారా ఓటింగ్‌ ప్రక్రియనంతా వీడియో రికార్డు చేయనున్నారు.

 

 

2072 పోలింగ్‌ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్‌ చేయనుండగా.. 2406 కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌ కూడా ఏర్పాటుచేశారు. ఇవి కాకుండా 2053 కేంద్రాల్లో 1240 మంది మైక్రో అబ్జర్వర్ల ద్వారా పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించనున్నారు. మున్సిపాలిటీల్లో 1107 ఆర్వోలు, ఏఆర్వోలు, కార్పొరేషన్లలో 153 మంది ఆర్వోలు, ఏఆర్వోలను నియమించారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు...

మరింత సమాచారం తెలుసుకోండి: