తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థకు లోనయ్యారు. నిన్న అర్దరాత్రి ఉన్నట్టుండి ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆస్పత్రికి వెళ్లారు. తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో అయన బాధపడుతుండటంతో సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లారు. దీంతో అక్కడ ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది.  

 

ప్రస్తుతం యశోదా ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అన్ని రకాల వైద్య పరిక్షలు చేస్తున్నట్టు సమాచారం. కాగా ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి ఆందోళన అక్కర్లేదని టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రి అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కేసీఆర్ సబ్ ఎలా ఉంది అని ట్విట్టర్ వేదికగా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

''కేసీఆర్ సర్ ఎలా ఉంది ? మీ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వార్తలు భారీ ఎత్తున వినిపిస్తున్నాయి. అసలు ఏమైంది ? యశోద ఆస్పత్రికి ఎందుకు వెళ్లారు? అన్న కేటీఆర్.. నువ్వు అయినా చెప్పు'' అంటూ నెటిజన్లు కేటీఆర్ కి ట్యాగ్ చేసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి ఆందోళన అక్కర్లేదని టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నేడు మున్సిపల్ ఎన్నికలు ఉండగా.. హఠాత్తుగా సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురవ్వడం అందరిని బాధలో ముంచేసింది. 

 

కాగా 2001లో ప్రత్యేక తెలంగాణ కావాలి అని తెలంగాణ కోసమే పార్టీ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉడుం పట్టు పట్టి కేవలం 13 సంవత్సరాల్లో తెలంగాణను సాధించి ముఖ్యమంత్రి అయ్యాడు.. ముఖ్యమంత్రి అయినా సమయం నుండి కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడం కోసం ఎంతో శ్రమించారు.. శర్మిస్తున్నారు.. సీఎం ఆరోగ్యం బాగుండాలని మనమందరం ఆశిద్దాం. 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: