ప్రపంచం ఎంతటి వేగంగా అభివృద్ధి చెందుతోందో అంతే వేగంగా వినాశనం వైపు అడుగులు వేస్తున్నది.  ఇందులో భాగంగానే ప్రపంచంలో అనేక రకాల వైరస్ లు ప్రభావం చూపుతున్నాయి.  ఈ వైరస్ ల ప్రభావం చేత ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  వైరస్ ప్రభావం నుంచి బయటపడేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ పెద్దగా ఉపయోగం ఉండటం లేదు.  ఒక్కో సీజన్ లో ఒక్కో మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది.  ఇప్పుడు చైనా నుంచి మరో మహమ్మారి వచ్చింది.  ఇదే కరోనా వైరస్.  

 

చైనాలోని ఉహాన్ నగరంలో ఈ వైరస్ ను మొదట కనుగొన్నారు.  మొదట జంతువుల నుంచి ఈ వైరస్ మనుషులకు సోకుతుందని అనుకున్నారు.  ఆ తరువాత మనుషుల నుంచి మరో మనిషికి వేగంగా ఈ వైరస్ సోకుతుంది.  స్పీడ్ గా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుండటంతో ప్రపంచం ఆందోళన చెందుతున్నది.  చైనా జనాభా ప్రపంచంలో అత్యధికంగా ఉన్నది. చైనా దేశం నుంచి అనేక దేశాలకు ప్రజలు నిత్యం ప్రయాణం చేస్తుంటారు.  వీరిని గుర్తించడం చాలా కష్టం.  


దీంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి.  ఈ వైరస్ ను అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి.  ఎలాగైనా సరే ఈ వైరస్ ను అడ్డుకోవడానికి సిద్ధం అవుతున్నాయి.  అడ్డుకోవడం కోసం అందరూ సదా సిద్ధం అవుతున్నారు.  చైనా కు అనుకోని ఉన్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి.  ఎక్కువగా చైనా నుంచి ఇండియాకు రాకపోకలు జరుగుతుంటాయి.  ఈ వైరస్ ఇండియాలోకి ప్రవేశిస్తే దానివలన ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుంది.  అడ్డుకోవడం చాలా కష్టం అవుతుంది.  


అందుకే చైనా, హాంకాంగ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులను ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక స్క్రీనింగ్ చేస్తున్నారు.  ఈ వైరస్ సోకిన 28 రోజుల్లోనే మరణిస్తారు.  ఇప్పటికే చైనాలో 6 మంది మరణించారు.  మొదట 15 మందికి సోకిన ఈ వైరస్ తరువాత 300 మందికి సోకింది.  ఈ సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నది.  అటు హాంకాంగ్ లో కూడా దీని ఆనవాళ్లు ఉన్నట్టుగా గుర్తించారు.  చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులు చౌకగా ఉంటాయి.  అదే విధంగా ఈ వైరస్ కూడా అదే స్పీడ్ తో ప్రపంచ దేశాల్లోకి వ్యాపించి వినాశనం చేస్తుందని భయపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: