కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.  రాజధాని కార్యాలయాలు అన్ని కూడా ఐదు మూడు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలోనే ఉండేలా నిర్మాణాలు చేపడుతున్నది.  రాష్టప్రతి భవన్ కు కూతవేటు దూరంలోనే ప్రధాని కార్యాలయం, నివాసం ఉండేలా ఏర్పాటు చేయబోతున్నారు.  అలానే కేంద్ర మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలు, మంత్రుల నివాసాలు పక్కపక్కనే ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  దీంతోపాటుగా ఇప్పటి వరకు అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలను సొంత భావనాల్లోకి తరలించే ఏర్పాటు చేస్తున్నారు.  


దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి వెయ్యికోట్ల రూపాయల ఆదాయం మిగులుతుంది.  రాష్ట్రపతి భావం నుంచి ఇండియా గెట్ వరకు ఉన్న ప్రాంతాల్లో ఈ కార్యాలయాల భవనాలు కొలువుదీరబోతున్నాయి.  రాష్ట్రపతి భవన్ నుంచి కూతవేటు దూరంలో ఉన్న పార్లమెంట్ భవన్ కు పక్కనే కొత్త పార్లమెంట్ ను నిర్మిస్తున్నారు.  2022 నాటికి ఈ పార్లమెంట్ కొత్త భవనం పూర్తవుతుంది.  తద్వారా పార్లమెంట్ భవనాన్ని కూడా మంత్రుల శాఖల, ఇతర కార్యాలయాల కోసం వినియోగించుకోబోతున్నారు.  


పార్లమెంట్ కొత్త భవనం 1300 మంది కూర్చునేలా ఉండేందుకు వీలుగా నిర్మిస్తున్నారు.  మంది మంచి పరిణామం అని చెప్పాలి.  పార్లమెంట్ పార్లమెంట్ భవనం ఏర్పాటు చేయాలి అంటే ఆషామాషీ కాదు.  కానీ, దీనిని యుద్ధప్రాతిపదికన 2022 వరకు పూర్తయ్యేలా నిర్మాణం మొదలు పెట్టారు.  ఇక సెంట్రల్ విస్టా నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలోనే సుప్రీం కోర్టు ఉన్నది.  నాలుగు కిలోమీటర్ల పరిధిలో న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ ఉన్నది.  అలానే 12 కిలోమీటర్ల పరిధికొనే విమానాశ్రయం కూడా ఉన్నది.  


ఇలా అన్ని కార్యాలయాలు ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉండటం వలన ఢిల్లీలో పనులు ఉన్న వ్యక్తులు వచ్చి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న కార్యాలయాలలో పనులు చూసుకొని వెళ్లేందుకు వీలు కలుగుతుంది.  వచ్చిన వ్యక్తులు ఎక్కడికెక్కడో తిరిగే ఇబ్బందులు తలెత్తవు.  అంతేకాదు, ఆందోళనలు చేసుకోవడానికి ఇండియా గెట్, జంతర్ మంతర్ కూడా ఐదారుకిలోమీటర్ల దూరంలోనే ఉండటం విశేషం.  సెంట్రల్ విస్టాను కేంద్రం అత్యంత ఆధునీకరణ వ్యవస్థతో చేపట్టబోతుండటం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: