రాజధాని అమరావతి నుండి విశాఖపట్నంకు తరలించటానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న డెడ్ లైన్ రెండు రోజులే అని సమాచారం. ఈనెల 24వ తేదీలోగా రాజధాని తరలింపు ప్రక్రియ మొదలైపోవాలట. లేకపోతే వాయిదా పడటమో లేకపోతే అసలు సాధ్యంకాకపోవటమో తథ్యమట. అందుకనే జగన్  హఠాత్తుగా రాజధాని తరలింపుపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టటం, బిల్లులను గెలిపించుకోవటానికి తొందర పడుతున్నట్లు తెలుస్తోంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే జగన్ కు ఉన్న డెడ్ లైన్ జాతక రీత్యా వచ్చిందట.  గ్రహస్ధితిగతులను  బట్టి ఈనెల 24వ తేదీన గోచార రీత్యా శనిగ్రహం ఇల్లు మారుతుందట. దీని ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు చేర్పులు జరుగుతుందట.  జరిగే మార్పులు, చేర్పులు ప్రధానంగా పాలకులపైనే పడుతుందనటంలో సందేహం లేదు. పాలకులపై గ్రహ ప్రభావం పడితే ఒకేసారి కొట్లాదిమంది మీద చూపుతుందనటంలో సందేహం లేదు.

 

జగన్ జాతక రీత్యా కూడా శని ప్రభావం తీవ్రంగా ఉంటుందట.  రాజధాని విషయంలో కూడా జగన్ అనుకున్నది అనుకున్నట్లు జరగాలంటే  24వ తేదీలోగా తరలింపు ప్రక్రియ పూర్తవ్వాలని  విశాఖపట్నంలోని శారధా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి చెప్పారట.  స్వరూపానంద అంటే జగన్ కు ఎంత గురో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  అందుకనే రాజధాని తరలింపు విషయంలో జగన్ ఇంత ఆతృత పడుతున్నట్లు సమాచారం.

 

సరే జగన్ ఎంత అనుకున్నా గ్రహస్ధితి అనుకూలించాలి కదా ? అసెంబ్లీ సమావేశాల్లో జగన్ అనుకున్నట్లే మూడు రాజధానుల బిల్లు, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లు పాసయ్యాయి. కానీ శాసనమండలి మాటేమిటి ? ఇక్కడ మెజారిటి కారణంగా తెలుగుదేశంపార్టీ అడ్డుకుంది. ఉద్దేశ్యపూర్వకంగానే బిల్లులు పాసవ్వటాన్ని తాత్కాలికంగా టిడిపి అడ్డుకుంటున్న విషయం అర్ధమైపోతోంది. మరి స్వరూపానంద చెప్పినట్లుగా 24 లోగా జరగకపోతే తర్వాత ఏమి జరుగుతుందో  తెలీదు. అందుకనే  జగన్ లో టెన్షన్ పెరిగిపోతోందట. చూద్దాం ఈ సమస్య నుండి జగన్ ఎలా బయటపడతారో ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: