చంద్రబాబునాయుడుకు ఎంఎల్సీలు పెద్ద షాకే ఇచ్చారు. ఎంఎల్సీల నుండి ఈ విధమైన షాక్ తగులుతుందని చంద్రబాబు ఏమాత్రం ఊహించలేదు.  జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనలకు చట్ట రూపం ఇవ్వటానికి ప్రభుత్వం ప్రత్యేకంగా మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  ఈ రోజు చివరి రోజులేండి. అసెంబ్లీలో బిల్లులు సులభంగానే పాసైపోయింది. సమస్యంతా శాసనమండలిలోనే మొదలైంది.

 

58 మంది సభ్యులున్న మండలిలో వైసిపికి మెజారిటి లేదు. 26 మంది సభ్యుల బలంతో తెలుగుదేశంపార్టీనే అతిపెద్ద పార్టీ. తర్వాత స్ధానం తొమ్మిది మంది సభ్యులతో వైసిపిది. పిడిఎఫ్ కు ఐదుగురు, బిజెపికి ముగ్గురు, ఇండిపెండెంట్లు నలుగురు సభ్యులున్నారు. మిగిలిన స్ధానాలు వివిధ కారణాలతో  ఖాళీగా ఉన్నాయి.  బలంలేని కారణంగా అసెంబ్లీలో వైసిపి పాసయ్యే కీలకమైన బిల్లులు మండలిలో వీగిపోతాయని అందరికీ తెలిసిందే.

 

అదే విధంగా మూడు రాజధానుల బిల్లు, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు మండలికి చేరుకుంది. అయితే బిల్లులపై చర్చ కాకుండా రూల్ 71 పై చర్చ, ఓటింగ్ కు పట్టుపట్టింది. సరే గంటల పాటు గందరగోళం తర్వాత ఛైర్మన్ రూల్ 71పై ఓటింగ్ కు నిర్వహించారు. దాంట్లో  టిడిపినే గెలిచింది. అయితే టిడిపికి ఉన్న 26 బలంలో 24 పడ్డాయి.  ఎంఎల్సీలు పోతుల సునీత, శివనాధరెడ్డి టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు తేలింది.

 

అదే సమయంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ సభ్యత్వానికి రాజీనామా చేయగా రత్నాబాయి, శమంతకమణి అసలు సమావేశాలకే హాజరుకాలేదు. ఇంత కీలక సమావేశాల్లో ఓటింగ్ జరిగినపుడు ప్రతి ఓటూ ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. అలాంటిది ఒకరు రాజీనామా చేయటం, ఇద్దరు వ్యతిరేకంగా ఓటు వేయటం, మరో ఇద్దరు అడ్రస్ లేకుండా పోయారని తెలియటంతో చంద్రబాబు షాక్ కు గురయ్యారు. మరి ఈ ఐదుగురు సభ్యుల విషయంలో ఎటువంటి వైఖరి అనుసరించాలో అర్ధంకాక ఇపుడు టిడిపిలో  టెన్షన్  పెరిగిపోతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: