నేడే మున్సిపల్ ఎన్నికల పోలింగ్... గెలుపు కోసం తహతహలాడుతున్న అభ్యర్థులందరిలో టెన్షన్ టెన్షన్.. ఓటర్లు మాకే ఓటు వేస్తారా ప్రత్యర్థులకు ఓటు వేస్తారా అనే అయోమయం... ఇక ఇన్ని రోజుల వరకు తమ బుట్టలో వేసుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేసిన అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేయడానికి ఓటర్లకు సమయం రానే వచ్చింది... ఓటర్ల అందరూ పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. నేడు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చేయనున్నారు. ఇక రాష్ట్రంలోని 80 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని... 120 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతోంది. 

 

 

 ఇక 9 కార్పొరేషన్లు మొత్తం 325 డివిజన్లు ఉండగా... 120 మున్సిపాలిటీలో 2727 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. వీటన్నింటికీ నేడు పోలింగ్ జరుగుతోంది. కాగా ఇప్పటికే మూడు డివిజన్ లు  మున్సిపాలిటీలోని 80 వార్డులు ఏకగ్రీవం అవ్వటంతో ... ప్రస్తుతం  324 డివిజన్లు  2,677 పోస్టులకు మాత్రమే పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారరులు. ఇకపోతే  ఈ ఎన్నికల్లో మొత్తం 53.50 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్దా  ఎ mక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలింగ్ నిర్వహణకు 50 వేల మందికి పైగా సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండగా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

 

 ఇక ఇప్పటికే ఓటర్ల అందరూ పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. తమ ఓటు హక్కును వినియోగించుకుని అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. మున్సిపల్ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మున్సిపల్ ఎన్నికలు ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరు నిలువుటద్దంలా  మారనున్నాయి . దీంతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ఎమ్మెల్యేలు, మంత్రులు . ఇక ప్రజా తీర్పు ఎలా ఉంటుందో అన్నది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: