రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళన రూపం మారుతోంది. ఆందోళ‌న బుధవారం నాటికి 36వ రోజుకు చేరింది. ఇవాళ కృష్ణా, గుంటూరు జిల్లాల బంద్‌కు అమరావతి జేఏసీ పిలుపు ఇచ్చింది. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నాలు నిర్వహించనున్నారు. అయితే, దీనిపై పోలీసులు కీల‌క ప్ర‌క‌ట‌న జారీ చేశారు. ఈ బంద్‌ల‌కు అనుమ‌తుల లేవ‌ని చెప్ప‌డ‌మే కాకుండా...త‌గు చ‌ర్య‌లు తీసుకోబ‌డ‌తాయ‌ని క్లారిటీ ఇచ్చారు. ఈ మేర‌కు గుంటూరు రూరల్ ఎస్పీ సిహెచ్. విజయరావు ఓ ప్ర‌క‌ట‌న విడుదల చేశారు. 

 


``తేదీ 22-01-20న ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు విషయంగా అమరావతి jac తలపెట్టిన బంద్ కార్యక్రమానికి గుంటూరు రూరల్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేవు. గుంటూరు రూరల్ పరిధుల్లో విద్యార్ధులకు, ఉద్యోగులకు, సాధారణ ప్రజలకు మరియు పబ్లిక్ / ప్రయివేటు రవాణాకు ఇబ్బంది కలిగే విధంగా ఎవ్వరూ అవాంఛనీయ కార్యక్రమాలు నిర్వహించరాదని, బలవంతంగా షాపులు, విద్యాసంస్థలు మూయించడం చేయరాదని, తెలియ పర్చడమైనది. బంద్ సందర్భంగా, సంఘ విద్రోహ శక్తులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నందున మరియు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న సంఘవిద్రోహ శక్తులు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను నష్టము కలుగచేసే చర్యలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిందిగా  కోరడమైనది. కనుక ఇలాంటి బంద్ కార్యక్రమాలలో ప్రజలు ఎవ్వరు పాల్గొనరాదని తెలియ పరచడమైనది. బంద్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలతో పాల్గొనే వారి పైన చట్టబద్దమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలపడమైనది.`` అని ఎస్పీ ప్ర‌క‌ట‌న స్ప‌ష్టం చేసింది. పోలీసుల ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో బంద్‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

 


ఇదిలాఉండ‌గా, మూడు రాజధానుల బిల్లుకు విపక్ష తెలుగుదేశం ‘తాత్కాలికంగా’ బ్రేకులు వేసింది. శాసన మండలిలో తనకున్న ఆధిక్యాన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంది. సీఆర్డీయే రద్దు, ఆంధ్రప్రదేశ్‌ పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లులకు రూల్‌ 71తో అడ్డుకట్ట వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: