అభివృద్ధి అనేది మనిషిని ఎంతలా మార్చేసిందంటే అతని మెదడును కంప్యూటర్ చిప్ప్‌లా వాడుకుంటుంది.. ముఖ్యంగా ఒక వ్యక్తికి సమాచారాన్ని చేరవేయాలంటే ఇప్పుడున్న సామాజిక మాద్యమం అతిగా ఉపయోగ పడుతుంది అని అనుకోవడంలో సందేహం లేదు. దీన్ని వినియోగిస్తున్న వారు ఎక్కువగా, సినిమా రంగాల వారు, బిజినెస్, రాజకీయ నాయకులు.. ఇక ఇప్పుడు జరిగే పురపోరులో కూడా మన రాజకీయ నాయకులు ఎన్నికల షెడ్యూలు విడుదల అయిన నాటినుంచే పెద్దఎత్తున ఈ విధంగా ప్రచారాన్ని నిర్వహించారట.

 

 

ఇకపోతే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ.. అన్ని పార్టీలు సామాజిక మాధ్యమం ద్వారా ప్రచారానికి పెద్దఎత్తున ఖర్చుచేశాయి. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అభ్యర్థులు ఒకరిని మించి మరొకరు పోటీపడి, సామాజిక మాధ్యమం ద్వారా తమ ప్రచారాలను కొన సాగించారట.. ఇదే గాకుండా తాజాగా రాష్ట్రంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో సామాజిక మాధ్య మానిదే అగ్రతాంబూలం. విద్యావంతులు, ఇంటర్నెట్‌ వినియోగదారు లు అధికంగా ఉండే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభ్యర్థులు సోషల్‌ మీడియాను ప్రధాన ప్రచారవేదిక చేసుకొన్నారు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ఖాతాలు ప్రారంభించి విజృంభిచారని సమాచారం..

 

 

ఇక తెలివి మీరిన నాయకులు, వార్డులవారీగా వాట్సప్‌ గ్రూప్‌లు ఏర్పాటుచేసుకొని, తమను గెలిపిస్తే ఏం చేయగలమో నేరుగా ఓటర్లకు చెప్పుకొచ్చారు. పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల ప్రచార కార్యక్రమాలు, సభలు, సమావేశాల ఫొటోలను పోస్ట్‌చేశారు. గుర్తులు తెలియజేస్తూ వాయిస్‌ రికార్డులను కూడా పంపించారట. ఇకపోతే సోషల్‌మీడియా ప్రచారంలో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగిందట. మొత్తం 130 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో, 16 లక్షల మంది కార్యకర్తలున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం  చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేర్చడంలో వీరు ముందున్నారట.

 

 

ఇకపోతే ఫేస్‌బుక్‌లో టీఆర్‌ఎస్‌ను అనుసరిస్తున్నవారు 12 లక్షల మంది ఉండగా, కాంగ్రెస్‌కు 2.24 లక్షలు, బీజేపీ కి 3లక్షల మంది ఉన్నారు. ట్విట్టర్‌లో టీఆర్‌ఎస్‌ను 3.65 లక్షలు, కాంగ్రెస్‌ను 55వేలు, బీజేపీని 54వేల మంది అనుసరిస్తున్నారని సమాచారం. ఇక ఇంతలా సామాజిక మాద్యమం ఉపయోగించుకున్న టీఆర్ఎస్  ఈ ఎలక్షన్లో గెలిచి అదే స్దాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో లేదో తెలుసుకోవాలంటే మరో మూడు రోజులు ఆగవలసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: