కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలంటూ ఎంతోమంది నిరసనలు ఆందోళనలు ధర్నాలు చేపడుతున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు సైతం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా స్వరాలు వినిపిస్తున్నారు. ఇక కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే తమ రాష్ట్ర పరిధిలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని తేల్చి చెప్పేశారు. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టిన  నాటి నుండి ఇప్పటికి పౌరసత్వ సవరణ చట్టం పై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల ఆందోళనకారుల నిరసనలు విధ్వంసకరంగా  మారుతున్నాయి. 

 

 

 ఇక విపక్ష పార్టీలు అన్నీ బీజేపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... ఎంతో సన్నిహితంగా ఉండే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు ప్రకటిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకం స్వరం వినిపించారు. కారణం మిత్రపక్షమైన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ తో భేటీ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకత  తెలపాలని కోరడమే అని అందరూ అనుకుంటున్నారు. అటు అసదుద్దీన్ ఒవైసీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం పై ఎన్నో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 

 

 

 ఇక తాజాగా పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉద్దేశించి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం పేరుతో ఎవరైనా కాగితాలు అడిగితే.. చార్మినార్ చూపించండి అంటూ అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని పాలించిన చరిత్ర తమకు ఉందని వ్యాఖ్యానించిన అక్బరుద్దీన్ ఓవైసీ... చార్మినార్, కుతుబ్ మీనార్ జామా మసీదులు  తమ పూర్వీకుల ఆనవాళ్లు అంటూ వెల్లడించారు. తరతరాల నుంచి తాము ఇక్కడే ఉన్నామని తమను ఎవరైనా కాగితాలు అడిగే ముందు ఆలోచించుకోవాలి హెచ్చరించారు అక్బరుద్దీన్ ఓవైసీ. దేశ ప్రధాని ప్రతి సంవత్సరం జాతీయ జెండాను ఎగురవేసే  ఎర్రకోట ను కూడా తమ పూర్వీకుల కట్టారు అంటూ వ్యాఖ్యానించారు అక్బరుద్దీన్ ఓవైసీ.

మరింత సమాచారం తెలుసుకోండి: