జగన్ అంటే రాష్ట్ర ప్రజలందరికీ కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదు... వృద్ధులకు పెద్ద కొడుకు ల... మహిళలకు పెద్దన్నల ... చిన్న పిల్లలకు మేనమామల... రైతన్నలకు ధీమాగా... ప్రతి ఒక్కరికి జగన్ చేయూతగా మారుతున్నారు. సీఎం జగన్ ప్రజలందరికీ ఒక నమ్మకం గా మారిపోయారు. రావాలి జగన్ కావాలి జగన్ అని కోరుకున్న ప్రజలందరికీ... అధికారంలోకి వచ్చాక ప్రజల కష్టాలు పోవాలి... రాష్ట్రాభివృద్ధి కావాలి అన్నట్లుగా పాలన సాగిస్తున్నారూ  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు మరెన్నో సంచలన పథకాలను ప్రవేశపెట్టి దేశ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయానికి తెర లేపుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నిరుపేద ప్రజలందరికి చేయూతనిచ్చేలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు.

 

 

జనం  కోసం కదిలిన నేతగా... జనం నాడిని తెలుసుకున్న గొప్ప మనిషిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన అందిస్తున్నారు . ఇక అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాష్ట్రంలో రైతులు ఎవరు ఇబ్బంది పడకుండా వ్యవసాయాభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్సార్ రైతు భరోసా పేరుతో రాష్ట్రంలో రైతులు అందరి  ఖాతాలో 13500 జమ చేసేందుకు నిర్ణయించింది ప్రభుత్వం. అంతేకాకుండా రైతులు వ్యవసాయానికి నీరు లేక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతులకు ఉచితంగా బోర్లు వేయించేందుకు కూడా నిర్ణయించింది. తాజాగా వ్యవసాయం రైతులకు మరింత సులభతరంగా మారేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది జగన్మోహన్రెడ్డి సర్కార్.

 

 

 రైతులందరూ పంట సాగు కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో... విత్తనాలు ఎరువుల కోసం ఫర్టిలైజర్ షాప్ ల వద్ద గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది రైతులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఎరువుల కోసం అన్నదాతలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో... గ్రామ పంచాయతీలోని రైతు భరోసా కేంద్రాల్లోనే రైతులందరికీ విత్తనాలు ఎరువులు పంపిణీ చేయాలని జగన్ సర్కారు నిర్ణయించింది. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు లోకి తేనుంది జగన్ సర్కారు. అలాగే రైతు భరోసా కేంద్రాల్లో అన్నదాతలకు పురుగుల మందులు కూడా అందుబాటులోకి తేనుంది జగన్ సర్కార్. కాగా రాష్ట్రవ్యాప్తంగా 11,158 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: