సింహం అంటే భయం ఎవరికి ఉండదు చెప్పండి... సింహాన్ని చూస్తే ఎవ్వరైనా భయంతో వణికి పోవాల్సిందే. అది అడవిలో ఉన్న జూ లో బంధించి వున్న సింహాన్ని చూడాలంటే మాత్రం భయపడాల్సిందే. సింహం అంటే ఎలా ఉంటుంది గాంభీర్యంగా... వెన్నులో వణుకు పుట్టించే చూపుతో... చూడటానికి భయపడేంత భయంకరమైన ఆకారంతో... ఉంటుంది. సింహం అంటే అడవికి రాజు. అడవిలో ఎంత పెద్ద జంతువులు ఉన్న అది సింహం తర్వాతే . ఇక మనం సింహాన్ని చూడాలంటే... జంతు ప్రదర్శనశాల కు వెళ్లి అక్కడ చూస్తూ ఉంటాం. జంతు ప్రదర్శనశాల అయితే ఏమిటి అక్కడ సింహం మాత్రం గంభీరంగానే  కనిపిస్తుంది... ఒక్కసారి మృగరాజు ఘింకటించాడు   అంటే... సింహం జూలో ఉన్న అడవిలో ఉన్న వెన్నులో వణుకు పుట్టాల్సిందే. 

 

 

 అయితే ఇప్పుడు వరకు సింహాన్ని చూసి భయపడిన వారు ఎంతోమంది ఉంటారు. కొంతమంది వైల్డ్లైఫ్ ఫోటోగ్రాఫర్ లు అడవిలోకి వెళ్లి సింహాన్ని చూసి భయపడిన వారు అయితే... కొంతమంది జంతుప్రదర్శనశాలలో చూసి భయపడిన వాళ్ళు ఉంటారు. కానీ అడవికి రారాజైన సింహాన్ని చూసి ఎవరైనా అయ్యో పాపం అని అంటారా.. అబ్బే సింహాన్ని చూస్తే భయపడాలి కానీ అయ్యో పాపం అనటమా... అంటారా... కానీ ఇక్కడ ఉన్న సింహాన్ని చూస్తే మాత్రం ఎవరైనా అయ్యో పాపం అనాల్సిందే... సింహం పై జాలి చూపించాల్సిందే. సింహం పరిస్థితి ఏంటో ఒకసారి చూడండి... ఈ సింహాన్ని చూస్తే అయ్యో పాపం అనాలనిపిస్తుంది కదా. 

 

 

 

 క్రూరత్వానికి  మారుపేరైన సింహాన్ని చూసి జనాలు భయపడతారు కానీ ఇక్కడ మాత్రం పాపం అంటున్నారు. సుడాన్ లో జంతు ప్రదర్శన శాల లో ఉన్న సింహాన్ని చూసి అక్కడికి వచ్చిన పర్యాటకులు అందరూ ఆ సింహం పై జాలి చూపిస్తున్నారు. అయ్యో పాపం అంటున్నారు.  ప్రస్తుతం సుడాన్ లో  తీవ్ర ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. అక్కడ ప్రజలకు తినడానికి తిండి లేని పరిస్థితి నెలకొంది. ఇక ప్రజలకే తిండి కరువైంది అంటే ఇక జంతుప్రదర్శనశాలలో ఉండే జంతువులకు ఆహారం మందులు ఎక్కడినుంచి పెడతారు చెప్పండి. దీంతో జంతు ప్రదర్శన శాల లో ఉండే జంతువులకు ఆహారం మందులు లాంటివేమీ లభించడం లేదు.  దీంతో జంతు ప్రదర్శన శాల లో ఉన్న జంతువులని బక్క చిక్కి పోయి ఎముకలు కనిపించేలా తయారయ్యాయి. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో కొంతమంది అప్లోడ్ చేయగా ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: