సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై బీజేపీ నేతలు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సీఎం జగన్ పై, వైసీపీ పార్టీపై ఏవేవో ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా కన్నా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. కన్నా లక్ష్మీ నారాయణ వైసీపీ పార్టీని, నేతలను విమర్శిస్తోంటే బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మాత్రం వైసీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసి పవన్ కు షాక్ ఇస్తున్నారు. 
 
బీజేపీ ఎంపీ జీవీఎల్ నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ రాజధాని అంశంలో అసలు ప్రభుత్వ జోక్యమేమీ ఉండదని కామెంట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అంశం రాజధాని అని కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోదని అన్నారు. పవన్ కళ్యాణ్ అమరావతి నుండి రాజధాని కదిలేది లేదని రాజధాని కదిలితే వైసీపీ ప్రభుత్వం కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. 
 
అదే సమయంలో రాజధాని అంశంలో బీజేపీ పార్టీ జోక్యం లేదని జీవీఎల్ చెబుతూ ఉండటం పవన్ కు షాక్ అనే చెప్పవచ్చు. శాశ్వత రాజధానిగా అమరావతే కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ చెబుతున్న సమయంలో జీవీఎల్ చెప్పిన మాటలతో బీజేపీ పార్టీ పవన్ గాలి తీసేసిందని ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీ, రాష్ట్ర బీజేపీ నాయకత్వం అమరావతే రాజధానిగా కొనసాగాలని తీర్మానం చేసినప్పటికీ రాజధాని అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదని స్పష్టం చేయడం పవన్ కు షాక్ అనే చెప్పవచ్చు. 
 
పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లబోతున్నానని అద్భుతాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్న సమయంలో బీజేపీ పార్టీ నేతల నుండి భిన్న స్వరాలు వినిపిస్తూ ఉండటంతో పవన్ చెప్పినట్టు నిజంగా అద్భుతాలు జరుగుతాయో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ మూడు రాజధానుల బిల్లుకు బ్రేక్ వేసింది. రూల్ 71ను తెరపైకి తెచ్చిన టీడీపీ సెలక్ట్ కమిటీ వ్యూహాన్ని సంధించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: