ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కులానికి చాలా ప్రాధాన్యం ఉన్న సంగతి తెలిసిందే. అందులోనూ ఏపీలో కమ్మ, రెడ్డి కులాల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుందన్న వాదన ఉంది. అందులో తెలుగు దేశం పార్టీ కమ్మలకు కేరాఫ్ అడ్రస్ అనీ.. రెడ్డి కులం నాయకులు ఎక్కువగా వైసీపీ వెంట ఉంటారని వాదన ఉంది. అయితే ఇందుకు కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయి.

 

కొందరు కమ్మ నేతలు వైసీపీలోనూ.. కొందరు రెడ్డి నాయకులు టీడీపీలోనూ ఉన్న సంగతి తెలిసిందే. అయితే అమరావతి నుంచి రాజధానిని తరలింపు విషయం తెరపైకి వచ్చినప్పటి నుంచి ఏపీ రాజకీయాల్లో కులం ప్రస్తావన మరింతగా పెరిగిపోయింది. ఇదే సయమంలో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య ఈ ప్రస్తావనలు పెరిగిపోయాయి.

 

ఈ నేపథ్యంలో జగన్ కమ్మకులాన్ని టార్గెట్ చేస్తున్నారని.. కమ్మ వాళ్లను వేధిస్తున్నాడని టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. ఈ సమయంలో ఓ కమ్మ కులానికి చెందిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కారు అన్ని కులాలను సమానంగా చూస్తోందని.. కమ్మ కులస్తుల కోసం త్వరలో జగన్ కమ్మ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారన్న విషయాన్ని తెలిపారు.

 

గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా కొన్ని కులాలకు కార్పొరేషన్ లు ఏర్పాటు చేశారు. వాటిలో బ్రహ్మణ కార్పోరేషన్, కాపు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే అగ్ర కులాలుగా పేరుబడిన కమ్మ, రెడ్డి కులాలకు కార్పోరేషన్ లు మాత్రం ఏర్పాటు చేయలేదు. కానీ జగన్ సర్కారు కమ్మ కులంలోని పేద వారి కోసం ఈ కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు.

 

అంటే గతంలో చంద్రబాబు కూడా చేయని పనిని ఇప్పుడు జగన్ చేయబోతున్నారన్నమాట. జగన్ సర్కారు కమ్మ కార్పొరేషన్ ఏర్పాటైటే..ఇక ఆ కులం ఓట్లు కూడా గంపగుత్తగా జగన్ పార్టీకే పడతాయన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: