చంద్రబాబు స్థాయి రోజురోజుకూ తగ్గిపోతుందా.. ఒక నాడు దేశమంతా 29 రాష్ట్రాలకు ఆదర్శ ముఖ్యమంత్రి అంటూ సొంత మీడియా ఊదరగొట్టిన నాయకుడు ఇప్పుడు కేవలం 29 గ్రామాలకే పరిమితం అవుతున్నారా.. 13 జిల్లాల ప్రజల అభీష్టాలను పక్కకు పెట్టి కేవలం అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల నాయకుడి స్థాయికి దిగజారిపోయారా.. ఇదే మాట అధకార పక్షం అంటోంది.

 

కౌన్సిల్‌లో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని.. ఇది సరైన పద్ధతి కాదని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. ఈ ప్రతిష్టంభన వెనక టీడీపీ ఉద్దేశమేమిటని చంద్రబాబును ప్రశ్నించారు. రాజ్యాంగ ప్రతిష్టంభన తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేత బాధ్యతను కూడా చంద్రబాబు నెరవేర్చలేకపోతున్నారని విమర్శించారు. టీడీపీని ఉప ప్రాంతీయ పార్టీగా మారుస్తున్నారని అన్నారు. చంద్రబాబు 29 గ్రామాలకే పరిమితం అవుతారా అని నిలదీశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు అవసరం చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు.

 

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అమరావతి ఉంటే చాలు ఇతర ప్రాంతాలు వద్దంటున్నారని.. ఈ విషయాన్ని జనసేన కార్యకర్తలు గుర్తించాలని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కోరారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం అద్భుతంగా ఉందని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. శాసన సభలో ఆ ప్రసంగం చూడని వ్యక్తులు.. ఒక్కసారైనా చూడాల్సిన అవసరం ఉందని, వినాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అభిప్రాయపడ్డారు.

 

మూడు ప్రాంతాలకు అభివృద్దిని వికేంద్రీకరణ చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ చారిత్రత్మక నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు చెప్పారు. శాసనసభలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లును మండలిలో అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. మండలి చైర్మన్‌కు ఒక బిల్లును అడ్మిట్‌ చేయాలా, వద్దా అనే అధికారం లేదన్నారు. ఏ బిల్లునైనా యథాతథంగా ప్రవేశపెట్టాలని చెప్పారు. మండలిలో చర్చ జరిగిన తర్వాత దానిని మద్దతు తెలుపాలా వద్దా అన్న అంశాన్ని సభ్యులు నిర్ణయిస్తారని చెప్పారు. టీడీపీకి మెజారిటీ ఉంటే మండలిలో సవరణలు కోరవచ్చన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: