నేడు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇన్ని  రోజుల  వరకు ఓటర్ మహాశయులకు మున్సిపల్ ఎన్నికలు పోటీ చేసే అభ్యర్థులు ఎంత మొత్తంలో ఆకర్షించారో  ఈరోజు తేలిపోతుంది.. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు అందరూ ఎంతో ఆసక్తి చూపుతున్నారు. 80 నియోజకవర్గాల్లో 120 మున్సిపాలిటీలో... 9 కార్పొరేషన్లలో  నేడు పోలింగ్ జరుగుతుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 53 లక్షల మంది ఓటర్లు మున్సిపల్ ఎన్నికల్లో ఓటును వినియోగించుకున్నారు. ఇక అధికారులు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 50 వేల మందికి పైగా సిబ్బందితో రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు. 

 

 

 ఇక ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాల వరకు ఓటర్లు బాలు తిడుతున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలీస్ మొదలైనప్పటికీ... చాలా పోలింగ్ కేద్రాల్లో  ఉదయం నుంచి పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఇప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు ఓటర్లు. ఇక కొత్తగా ఓటు సంపాదించుకున్న వారు కూడా మున్సిపల్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం పోలింగ్ నమోదు అవ్వగా... జిల్లాలవారీగా 12గంటల వరకు ఎంత శాతం పోలింగ్ నమోదు అయ్యింది అంటే. యాదాద్రి భువనగిరి జిల్లాలో 40 శాతం... నాగర్ కర్నూలు జిల్లాలో 30 శాతం, వికారాబాద్ జిల్లాలో 25 శాతం, కామారెడ్డి జిల్లాలో 36 శాతం, మహబూబ్నగర్ జిల్లాలో 28 శాతం, నల్గొండ సూర్యాపేట  జిల్లాలో 37%, నిజాంబాద్ జిల్లాలో 37శాతం, సంగారెడ్డి జిల్లాలో 36% పోలింగ్ నమోదయింది. 

 

 

 ఇక కార్పొరేషన్ వారిగా... బోడుప్పల్ కార్పొరేషన్లో 35 శాతం పోలింగ్ నమోదు అవ్వగా... నిజాంపేట్ కార్పోరేషన్లు 19 శాతం పోలింగ్ నమోదయింది. జవహార్ నగర్ కార్పొరేషన్ లో  26 శాతం,  రామగుండం కార్పోరేషన్ లో 27 శాతం, బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్లో 21%, ఫిర్దాజి గూడా   కార్పొరేషన్ లో  35 శాతం పోలింగ్ నమోదయింది. పలు పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ మందకొడిగానే  కొనసాగుతోంది. ఓటర్లు రాక పోలింగ్ కేంద్రాలు అన్ని వెలవెలబోతున్నాయి. చాలా తక్కువ మొత్తంలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓట్లు వేస్తున్నారు. ఇక పలుచోట్ల ఓటర్లను మభ్యపెట్టేందుకు డబ్బులు పంచుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో పలు పోలింగ్ కేంద్రాల వద్ద తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: