సుప్రీం కోర్టు సీఏఏపై స్టేను జారీ చేయటానికి నిరాకరించింది. కేంద్రానికి సుప్రీం కోర్టు సీఏఏ గురించి దాఖలైన పిటిషన్లను గురించి నాలుగు వారాలలోగా కేంద్రం సమాధానం ఇవ్వాలని సూచనలు చేసింది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్ల గురించి మధ్యంతర ఉత్తర్వులను ఇస్తుందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ చట్టాన్ని అమలు కాకుండా నిలుపుదల చేయలేమని ఈ కేసులో కేంద్రం వాదన కూడా వినాల్సి ఉందని సుప్రీం స్పష్టం చేసింది. 
 
ఎంతో వివాదాస్పదమైన సీఏఏ బిల్లు గురించి భారీ సంఖ్యలో ఏకంగా 144 పిటిషన్లు దాఖలయ్యాయి. ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ సీజేఐ ఎస్.ఏ.బాబ్డే నేతృత్వంలో ఈరోజు ఈ పిటిషన్ల గురించి విచారణ జరిగింది. సీఏఏ చట్టాన్ని ఉపసంహరించాలని కోరుతూ భారీ సంఖ్యలో పిటిషన్లు దాఖలు కావడం గమనార్హం. పిటిషనర్లు సమానత్వ హక్కుకు, మౌలిక రాజ్యాంగ వ్యవస్థకు ఈ చట్టం వ్యతిరేకమని అన్నారు. 
 
ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రముఖ పార్టీలతో పాటు ప్రముఖ సినీ నటులు కూడా పిటిషన్లు వేయడం గమనార్హం. కాంగ్రెస్, సీపీఐ, డీఎంకే, ఎంఐఎం, ఐఎంయుఎల్ పార్టీలతో పాటు ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ తను స్థాపించిన పార్టీ ద్వారా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నెల 9వ తేదీన సవరించిన పౌరసత్వ చట్టం రాజ్యాంగబద్ధమైనదేనని కోరుతూ దాఖలైన పిటిషన్ గురించి విచారణ చేపట్టేందుకు కోర్టు నిరాకరించింది. 
 
బీ ఆర్ గవాయ్, సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం వివిధ సమస్యలను దేశం ఎదుర్కొంటోందని శాంతి నెలకొనేలా చూడాల్సిన పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. కోర్టు ఉన్నది చట్టం రాజ్యాంగబద్ధమైనదో కాదో ప్రకటించటానికి కాదని చట్టం చెల్లుబాటు అవుతుందో కాదో మాత్రమే కోర్టు చెబుతోందని అన్నారు. కేంద్రానికి కూడా కోర్టు దాఖలైన పిటిషన్లకు సంబంధించిన నోటీసులను జారీ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: