ఏపీ అసెంబ్లీ స‌మావేశాడు మూడు రోజు ప్రారంభ‌మ‌య్యాయి. సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ నేప‌థ్యంలోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పొడియంను చుట్టుముట్టడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు సభలో వీధిరౌడీలు మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు మొత్తం కలిపి 10 మంది కూడా లేరని, ప్రజాస్వామ్యాన్ని కించపర్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మేం 151మంది ఉన్నా ఎంతో ఓపికా ఉన్నామన్నారు. 

 

అలాగే స్పీకర్‌ను అగౌరవపరుస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని.. దీంతో వైసీపీ నేతలు రెచ్చిపోయి దాడి చేస్తే.. ఆ ఘటనను రాజకీయం చేసి లబ్ధిపొందే దిక్కుమాలిన పార్టీ టీడీపీ అని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.  సంస్కారం లేని ఇలాంటి వ్యక్తులు సభకు ఎందుకు వస్తున్నారో? అర్థం కవడంలేదని అన్నారు. అస‌లు అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలో చేతకాకపోతే అసెంబ్లీకి రావొద్దన్నారు. ఎవరైనా పోడియం వద్దకు వస్తే... మార్షల్స్‌తోబయటకు ఈడ్చేస్తామన్నారు.  పోడియం వద్ద మార్షల్స్‌ను పిలిపించి ఉంచాలన్నారు. పోడియం రింగ్ దాటి లోపలికి వస్తే బయటకు పంపాలని.. స్పీకర్‌కు తెలిపారు సీఎం జగన్. దీంతో దీంతో స్పీకర్ వెంటనే మార్షల్స్‌ను సభలోకి పిలిపించారు. 

 

మ‌రోవైపు టీడీపీ సభ్యుల తీరుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రైతులకు సంబంధించి చర్చ జరుగుతుంటే.. అడ్డుకోవడం దారుణమన్నారు. కాగా, ఈ గందరగోళం మధ్యే ఏపీలో రైతు భరోసా కేంద్రాలపై చర్చను ప్రారంభించారు. అయితే రైతు భరోసా కేంద్రాలపై చర్చ జరుగుతోన్న సమయంలో శాసనసభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం మ‌రో సారి తీవ్ర మనస్తాపం చెందారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎటువంటి చర్యలకైనా సిద్ధమని ప్రకటించారు. ఇక అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టీతో ముగియనున్నాయి. అయితే గత రెండురోజులుగా సభలో టీడీపీ సభ్యులు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. జై అమరావతి నినాదాలతో హోరెత్తిస్తున్నారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: